iDreamPost

పూజారులకు కర్ణాటక ప్రభుత్వం షాక్! 10 ఏళ్ల జీతం వెనక్కి ఇవ్వమని నోటీసులు!

  • Published Jan 23, 2024 | 2:14 PMUpdated Jan 23, 2024 | 2:14 PM

దేశంల ఎక్కడ వినని వింత నిర్ణయన్ని ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. అసలు ఇంతకి ఏం జరిగిదంటే..

దేశంల ఎక్కడ వినని వింత నిర్ణయన్ని ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. అసలు ఇంతకి ఏం జరిగిదంటే..

  • Published Jan 23, 2024 | 2:14 PMUpdated Jan 23, 2024 | 2:14 PM
పూజారులకు కర్ణాటక ప్రభుత్వం షాక్! 10 ఏళ్ల జీతం వెనక్కి ఇవ్వమని నోటీసులు!

దేశంలోని ఏ ప్రభత్వం కని విని ఎరుగని వింత నిర్ణయన్ని ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు బిగ్ షాక్ తగిలింది. అసలు దేవాలయంలో పురోహితులంటే దైవం తర్వాత దైవం వంటి వారు. అలాంటి పవిత్ర పండితులైన పూజారులకు ముక్కున వేలుసుకునే విధాంగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏ దేవాలయాల్లో వినని వింత నిర్ణయాన్ని ఎదుర్కొన్న పూజరులకు ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఇంతటి విచిత్రమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడ రాముడికి పూజలు చేసే కన్నడ పండితులకు సిద్ధరామయ్య ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కర్ణాటకలోని ఆలయ పూజారులకు ఊహించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 10 ఏళ్లుగా ఆలయంలో పూజలు చేస్తూ అర్చకులు తీసుకుంటున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇంతటి ఘోరమైన ప్రకటనను విన్న కన్నడ పండితులు దిక్కుతోచని స్థితిలో కుప్పకొల్పోయారు. ఇందులో భాగంగానే.. ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ తో సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ఇది చిక్‌మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. అర్చకులు పూజలు చేస్తున్న ఆలయాల్లో కొన్ని రోజులుగా ఆదాయం తగ్గింది. కానీ.. ప్రభుత్వం ద్వారా అర్చకులు ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. అందుకుగాను.. గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్దరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది.

Karnataka government shock for priests

ముఖ్యంగా రాముడికి పూజలు చేసే పూజారి అయిన హిరేమగలూరు కన్నన్ కు ఇది ఒక భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. కన్నన్ కు గత ఏడాదిలోనే జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. కాగా, ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. కన్నన్ కు నెలకు వేతనంగా రూ.4500 ప్రభుత్వం చెల్లించేవారు. ఇలా చూసుకుంటే 10 ఏళ్లకు గాను రూ. 4,74,000లను చెల్లించేది. కనుక ఇప్పుడు ఈ మొత్తాన్ని హిరేమగళూరు కన్నన్‌ తో పాటు మిగిలిన పండితులంతా.. ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

కాగా, కన్నడ పండితుడిగా పేరుగాంచిన.. హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్కమగళూరు శివార్లలోని కల్యాణ కోదండ రామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకూ నెలకు రూ.7500 చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండడంతో ఇప్పుడు నెలకు రూ. 4500 జీతం చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వమనడంతో అర్చకులంతా ఆందోళనల చెందుతున్నారు. మరి, కర్ణాటక ప్రభుత్వం అర్చకులకు ఇచ్చిన వేతనాన్ని తిరిగి ఇవ్వమనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి