iDreamPost

కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ వెధవల వల్లే రాకేష్‌ మాస్టర్‌ మృతి!’

  • Published Jun 20, 2023 | 11:46 AMUpdated Jun 20, 2023 | 11:46 AM
  • Published Jun 20, 2023 | 11:46 AMUpdated Jun 20, 2023 | 11:46 AM
కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు.. ‘ఆ వెధవల వల్లే రాకేష్‌ మాస్టర్‌ మృతి!’

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ ఆదివారం సాయంత్రం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచాడు. రాకేష్‌ మాస్టర్‌ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రాకేష్‌ మాస్టర్‌. ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలకు డ్యాన్స్‌లో కోచింగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ వంటి వారు రాకేష్‌ మాస్టర్‌ శిష్యులే. ఒకప్పుడు టాప్‌ కొరియోగ్రాఫర్‌గా రాణించిన రాకేష్‌ మాస్టర్‌.. ఆ తర్వాత యూట్యూబ్‌ చానెల్స్‌కి ఇంటర్వ్యూల ఇస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచేవారు.

ఇదిలా ఉండగా..రాకేష్ మాస్టర్ మరణంపై నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేశారు . రాకేష్ మాస్టర్‌కి నివాళులు అర్పించిన తర్వాత కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘రాకేష్ మాస్టర్ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైపోయారు. అన్ని విధాలుగా అలవాట్లను కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. ఆయన అందరికీ మంచి చేసే మనిషి. మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆపదలో ఉన్న వాళ్లకి తనకి తోచిన సాయం చేసేవారు. జప్ఫా షో అని ఆయనకి నచ్చింది ఏదో చేస్తున్నారు. దానిపై నెగిటివ్ కామెంట్లు చేయడం దారుణం’’ అంటూ విరుచుకుపడింది.

‘‘రాకేష్‌ మాస్టర్‌ చాలా పెద్ద వ్యక్తి.. తన కెరీర్‌లో ఆయన సుమారు 1500 సినిమాలు చేశారు. అంతగొప్ప వ్యక్తి గురించి తప్పుడు వార్తలు రాసేవారు. అసలు రాకేష్ మాస్టర్‌ని కామెంట్ చేసే అర్హత వీళ్లకి ఉందా. వీళ్ల వయసు ఆయన అనుభవం అంత ఉండదు. అలాంటి వాళ్లు కూడా ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. వీరంతా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చూసి ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు. పైకి ఎంత ధైర్యంగా ఉన్నా.. లోపల బాధపడతారు ఎవరైనా. ఓ పక్క ఆయన లైఫ్ పోయింది.. ఇంకో పక్క కెరియర్ పోయింది. దీనికి తోడు ఇలాంటి వెధవలంతా అనే మాటల్ని విని మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్లారు. అయినా సరే పోరటం చేస్తూనే ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మందుని అలవాటు చేసుకున్నారు.. ఇలా తాగితాగి చివరికి చనిపోయారు’’అంటూ ఆవేదన వ్యక్తి చేసింది కరాటే కళ్యాణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి