iDreamPost

ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న రిషబ్ శెట్టి!

Rishab Shetty Adopts Govt School: కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న సినిమాతో వచ్చి..పెద్ద హిట్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.

Rishab Shetty Adopts Govt School: కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న సినిమాతో వచ్చి..పెద్ద హిట్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న రిషబ్ శెట్టి!

సాటివారికి సాయం చేయడం దేవుడి పూజ చేసిన దానితో సమానం. అందుకే మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు అన్నారు. అందుకే చాలా మంది తమ సామర్థ్యం మేరకు సమాజానికి సేవ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఇలా కేవలం సామాన్యులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖుల్లో చాలా మంది కూడా వివిధ ఫౌండేషన్లు ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉచిత వైద్యం, పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్యా, నీరు వంటి అనేక సదుపాయాలను తమ ఫౌండేషన్ల ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే పలువు హీరోలు గ్రామాలను, పాఠశాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తాజాగా కాంతార స్టార్ హీరో రిషభ్ శెట్టి కూడా మంచి మనస్సు చాటుచుకున్నారు.

కాంతార సినిమా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి.. బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అంతేకాక భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అనేక రికార్డులను కాంతార మూవీ తిరగరాసింది. ఓ ప్రాంతంలో ఉండే సంప్రదాయాన్ని, వేడుకను ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించడమే కాకుండా, హీరోగా నటించారు. అందులో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.

rishab shetty great human being

ఇక ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమాతో రిషబ్ శెట్టి నేషనల్ స్టార్ గా మారిపోయారు. ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తోంది. కన్నడ స్టార్ నుంచి.. నేషనల్ స్టార్ గా రిషబ్ శెట్టి ఎదిగారు. ఇక తాజాగా ఆయన ఓ మంచి మనస్సు చాటుకున్నారు. తన సొంత గ్రామం కెరడీలో ఉన్న పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన వంతుగా సమాజా అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన టీమ్ తెలిపింది.

దక్షిణ కర్నాటకలోని కెరడీ అనే గ్రామం నుంచి రిషబ్ శెట్టి ఇండస్ట్రీకి వచ్చారు. తాజాగా తన సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలను ఆయన దత్తతు తీసుకున్నారు. ఆయన బృందం తెలిపిన ప్రకారం.. రిషబ్ శెట్టి ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. ఆ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నారు. రిషబ్ శెట్టి ఫౌండేషన్ ను గతేడాది ప్రారంభించారు. దీంతో స్థానికులు రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన గతంలో ‘సర్కారీ హై ప్రా. షాలే, కాసరగోడు’ సినిమా ద్వారా కన్నడ పాఠశాలల దుస్థితి గురించి అవగాహన కల్పించారు.
ఈ సినిమా 2018లో వచ్చి మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆయన కాంతార స్వీకెల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శెట్టి తన 2022 హిట్ కాంతారాకు ప్రీక్వెల్ అయిన కాంతారా ఎ లెజెండ్: చాఫ్టర్-1 కోసం సన్నాహాలు ప్రారంభించాడు. కొత్త చిత్రం కర్ణాటకలోని పురాతన రాజకుటుంబమైన కదంబ రాజవంశం పాలన గురించి తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి…ప్రభుత్వ బడిని దత్తతు తీసుకుని మంచి మనస్సు చాటుకున్న రిషబ్ శెట్టిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి