iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, ప్రముఖ నిర్మాత కన్నుమూత

ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నాలుగు వ్యవధి నెలల కాలంలోనే పలు పరిశ్రమలు.. దిగ్గజ నటులతో పాటు యంగ్ యాక్టర్స్, టెక్నీషియన్లను కోల్పోతున్నాయి. తాజాగా మరో దిగ్గజ నటుడు కమ్ నిర్మాత మరణించారు.

ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నాలుగు వ్యవధి నెలల కాలంలోనే పలు పరిశ్రమలు.. దిగ్గజ నటులతో పాటు యంగ్ యాక్టర్స్, టెక్నీషియన్లను కోల్పోతున్నాయి. తాజాగా మరో దిగ్గజ నటుడు కమ్ నిర్మాత మరణించారు.

ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, ప్రముఖ నిర్మాత కన్నుమూత

ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచెత్తూ సినీ దిగ్గజాలు, పేరు మోసిన నటులు తిరిగి రాని లోకాలకు తరలి వెళుతున్నారు. నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు సుమారు అన్నీ ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు, టెక్లీషియన్లు, ఇండస్ట్రీతో సంబంధాలున్న వ్యక్తులు మృతి చెందారు. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు శేషు, విశ్వేశ్వరరావు మరణించారు. తెలుగు నటుడు వీరభద్రరావు మరణించారు. అలాగే మాలీవుడ్ నటుడు సుజిత్, చత్తీస్ గఢ్ నటుడు ప్రదీప్ శర్మ రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు. డబ్బింగ్ సినిమాల గేయ రచయిత శ్రీ రామకృష్ణ కూడా ఇటీవలే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు మరో దిగ్గజ నటుడు, ఎన్టీఆర్ అవాడు గ్రహీత మరణించారు.

చందన సీమ ఓ దిగ్గజ నటుడ్ని కోల్పోయింది. ద్వారకీష్ తన 81 వయస్సులో మరణించారు. గుండెపోటుకు గురై..ఏప్రిల్ 16న మరణించారు. 1963లో కన్నడ సీమలోకి అడుగుపెట్టిన ఆయన.. 150కి పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా మారి.. 50 సినిమాలను తెరకెక్కించారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు కిషోర్ కుమార్‌ను కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. తెలుగు సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు. సత్తెకాలపు సత్తయ్య, పరమానందయ్య శిష్యుల కథ, రామాయణంలో పిడకల వేట, ఎవరికి వారే యుమునా తీరే వంటి తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారారు. తమిళంలో విజయం సాధించిన బిచ్చగాడును కన్నడలో రీమేక్ చేశారు.

ఆయనకు తెలుగు నటులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావులతో మంచి సత్సంబంధాలున్నాయి. ఆయన దర్శకుడిగా కూడా పలు చిత్రాలు తీశాడు. అలాగే ఎంతో మంది దర్శకులను, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి గాడ్ ఫాదర్ అనిపించుకున్నారు. కన్నడ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను.. ఎన్టీఆర్ అవార్డు వరించింది. ఆయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. ద్వారకీష్ మరణించారని తెలియగానే శాండిల్ వుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనకు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి