iDreamPost
android-app
ios-app

OTT Release: OTTలోకి ‘సలార్’ ను ఢీ కొట్టి విజయం సాధించిన మూవీ! స్ట్రీమింగ్ వివరాలు..

  • Published Feb 01, 2024 | 10:04 PM Updated Updated Feb 01, 2024 | 10:04 PM

త్వరలోనే ఓ సినిమా ఓటీటీని షేక్ చేయడానికి వస్తోంది. ఈ మూవీ ఏకంగా ప్రభాస్ సలార్ నే ఢీ కొట్టి విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

త్వరలోనే ఓ సినిమా ఓటీటీని షేక్ చేయడానికి వస్తోంది. ఈ మూవీ ఏకంగా ప్రభాస్ సలార్ నే ఢీ కొట్టి విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OTT Release: OTTలోకి ‘సలార్’ ను ఢీ కొట్టి విజయం సాధించిన మూవీ! స్ట్రీమింగ్ వివరాలు..

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. రోజురోజుకు ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో సంస్థలు సైతం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా కంటెంట్ ను తీసుకొస్తోంది. ఎక్కుత థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను, మూవీలను ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే డిఫరెంట్ జోనర్లను చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే త్వరలోనే ఓ సినిమా ఓటీటీని షేక్ చేయడానికి వస్తోంది. ఈ మూవీ ఏకంగా ప్రభాస్ సలార్ నే ఢీ కొట్టి విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇంతటి సినిమాకు ఎదురెళ్లి మరీ విజయం సాధించాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ సుదర్శన్. ఇతడు నటించిన మూవీ ‘కాటేరా’.. డిసెంబర్ 29న భారీ ఎత్తున విడుదల అయ్యింది. అయితే చాలా మంది ప్రభాస్ సలార్ మూవీ వస్తుంది నీ సినిమా వాయిదా వేసుకో అని సుదర్శన్ కు సలహాలు కూడా ఇచ్చారట.

కానీ అవన్నీ పట్టించుకోకుండా కాటేరాను రిలీజ్ చేశాడు ఛాలెంజింగ్ స్టార్ సుదర్శన్. ప్రభంజనం సృష్టిస్తోన్న సలార్ మూవీని పక్కకు నెట్టి కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక విడుదలైన సుమారు నెలన్నర తర్వాత ఓటీటీ బాటపట్టింది ఈ మూవీ. ఫిబ్రవరి 9న ప్రముఖ ఓటీటీ అయిన జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. అన్ని భాషల్లో ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ చేద్దామని భావించిన.. కొన్ని సమస్యల కారణంగా కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే ప్రసారం అవ్వనుంది. మిగతా భాషల్లో ఎప్పుడు అవుతుందో ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. ఇక ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లను కొల్లగొట్టింది. మరి సలార్ నే ఢీ కొట్టి విజయం సాధించిన ఈ మూవీ ఎలా ఫిబ్రవరి 9న జీ5లో చూసేయండి మరి.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/