iDreamPost

బాలీవుడ్ వాళ్ళు అలా చేయలేదు.. సౌత్ మాత్రమే ఆ ఘనత సాధించింది..

బాలీవుడ్ వాళ్ళు అలా చేయలేదు.. సౌత్ మాత్రమే ఆ ఘనత సాధించింది..

కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ లాంటి స్టార్ హీరోలు ముఖ్యపాత్రల్లో, సూర్య లాంటి మరో స్టార్ హీరో గెస్ట్ గా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్ ఇండియా సినిమాగా విక్రమ్ విడుదల అవ్వనుంది. విక్రమ్ సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా పాన్ ఇండియా సినిమా, సౌత్, బాలీవుడ్ అని వినిపిస్తుంది. ఈ టాపిక్ పై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. తాజాగా కమల్ హాసన్ కూడా ఈ టాపిక్ పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్‌ నేషనల్‌ ఫిలిం మేకింగ్‌ కి హబ్‌గా తయారయింది. ఒకప్పుడు ఇలా చెన్నై ఉండేది. నాగిరెడ్డిగారి లాంటి దర్శకులు ‘మాయాబజార్‌’ లాంటి చిత్రాలను అప్పట్లోనే తెలుగు– తమిళ్‌లో తీశారు. రాముడు–భీముడు, ఎంగ వీట్టు పిళ్ళై, రామ్‌ ఔర్‌ శ్యామ్‌… ఇలా అనేక భాషల్లో అప్పట్లోనే సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై రామానాయుడు నిర్మించారు. ‘చంద్రలేఖ’ మొదటి పాన్‌ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు ‘బాహుబలి’ కూడా. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు ఇతర భాషల్లో సినిమాలు నిర్మించలేదు. కానీ గతంలోనే సౌత్‌ నుండి అన్ని భాషల చిత్రాలు నిర్మించారు. రామానాయుడుగారు అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించి రికార్డు సృష్టించారు. ఆయన నేషనల్‌ ప్రొడ్యూసర్‌. పాన్‌ ఇండియా నిర్మాత. ఈ ఘనత సౌత్ వాళ్ళకి మాత్రమే దక్కింది అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి