iDreamPost

బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వైరలవుతున్న వీడియో!

  • Author Soma Sekhar Published - 05:39 PM, Mon - 9 October 23
  • Author Soma Sekhar Published - 05:39 PM, Mon - 9 October 23
బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వైరలవుతున్న వీడియో!

బతుకమ్మ.. తెలంగాణలో జరిగే అతిపెద్ద పూల పండుగ. తెలంగాణ అస్థిత్వాన్ని తెలిపేలా అంగరంగ వైభవంగా ఈ వేడుకను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. భాద్రపద అమావాస్య నాడు ఎంగిలి పూలతో మెుదలయ్యే ఈ వేడుక అష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే ఈసారి బతుకమ్మ పండుగ కాస్త ముందుగానే వచ్చింది. అదేంటి ముందుగా రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండీ.. ఆదివారం నాడు జరిగిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్స్ కాజల్, శ్రీలీలలు బతుకమ్మ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నందమూరి బాలకృష్ణ-కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఆదివారం హన్మకొండలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హీరోయిన్స్ కాజల్, శ్రీలీలు తెలుగుదనం ఉట్టిపడేలా చీరలో మెరిశారు. ఇక వేడుకలో నెత్తిన బతుకమ్మతో వేదికపైకి వచ్చి ఆడిపాడారు కాజల్, శ్రీలీల. చూడముచ్చటగా బతుకమ్మ ఆడారు స్టార్ హీరోయిన్స్. స్టేజ్ పై వారు బతుకమ్మ ఆడుతుంటే ప్రేక్షకుల ఈలలు, గోలలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న భగవంత్ కేసరి దసర కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నాడు. మరి తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసి.. బతుకమ్మ ఆడిన హీరోయిన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి