iDreamPost

రామ్సే హంట్ సిండ్రోమ్ అంటే ఏంటి? జ‌స్టిన్ బీబ‌ర్ కు ముఖ ప‌క్ష‌వాతం

రామ్సే హంట్ సిండ్రోమ్ అంటే ఏంటి? జ‌స్టిన్ బీబ‌ర్ కు ముఖ ప‌క్ష‌వాతం

ప్రపంచానికి తెలిసిన, 28 ఏళ్ల‌ గ్రామీ విన్న‌ర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) శుక్ర‌వారం ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. నాకు రామ్సే హంట్ సిండ్రోమ్ (Ramsay Hunt Syndrome)వ‌చ్చింది. ముఖంలో స‌గానికి ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ని అభిమానుల‌తో చెప్పాడు. అందువ‌ల్ల టొరంటో, వాషింగ్ట‌న్ లో చేయాల్సిన షోల‌ను ర‌ద్దుచేసుకున్నాడు. త‌న‌కొచ్చిన స‌మ‌స్య చాలా సీరియ‌స్. ముఖంలో స‌గం భాగాన్ని క‌దిలించ‌లేక‌పోతున్నాన‌ని చెప్పాడు.

ఏంటీ రామ్సే హంట్ సిండ్రోమ్?

Ramsay Hunt syndrome (RHS) చాలా త‌క్కువ‌మందికి వ‌చ్చే నాడీ సంబంధ వ్యాధి. దీనివ‌ల్ల ముఖానికి ప‌క్ష‌వాతం వ‌స్తుంది. నోటీ మీద‌కాని, చెవిమీద కాని ఎర్రగా బొబ్బ‌లుకాని, దద్ద‌ర్లుకాని వ‌స్తాయి. చెవిలో రింగ్ రింగ్ మ‌ని శ‌బ్ధాలు వ‌స్తాయి. కొంద‌రికి వినికిడి స‌మ‌స్య వ‌స్తుంది. రామ్సే హంట్ సిండ్రోమ్ వల్ల నొప్పి పుట్టించే దద్దుర్లు రావటంతో పాటు, ఫేసియల్ పెరాలసిస్ కూడా రావచ్చు. చాలా మందిలో ఈ రామ్సే హంట్ సిండ్రోమ్ లక్షణాలు తాత్కాలికం, కానీ కొంద‌రిలో అవి శాశ్వతంగా మారే అవకాశమూ ఉంది. ఈ సిండ్రోమ్ బారిన పడినవాళ్లు ఒక కంటిని మూయలేకపోవటం వల్ల కన్ను నొప్పి కూడా వ‌స్తుంది. బీబ‌ర్ కి ఇలాంటి స‌మ‌స్య వ‌చ్చింది. వారి చూపు మసకబారవచ్చుకూడా. ఈ రుగ్మత 60 ఏళ్ల దాటిన వారిలో ఎక్కువ క‌నిపిస్తుంది. కుర్రాళ్ల‌కు రావ‌డం చాలా త‌క్కువ‌. ఇక పిల్ల‌ల‌కంటే చాలా అరుదు అనే చెప్పాలి.

పిల్ల‌ల్లో చికెన్ ఫాక్స్, పెద్ద‌ల్లో షింగల్స్ కు కార‌ణ‌యైయ్యేది వరిసెల్లా జోస్టర్ వైరస్ (varicella zoster virus). షింగ‌ల్స్ అనేది వైరస్ వలన సంభవించే ఒక సంక్రమణం, ఇది చర్మం మీద బొబ్బలు, దద్దుర్లకు దారితీస్తుంది. ఈ వైర‌స్ Ramsay Hunt syndromeకు కార‌ణ‌మ‌వుతుంది. చికెన్ ఫాక్స్ నుండి ఒక వ్యక్తి కోలుకున్న తర్వాత కూడా, నరాల కణజాలంలో వైరస్ క్రియా రహితం ఉంటుంది. సిండ్రోమ్ వ‌ల్ల క్రియాశీల‌క‌మ‌వుతుంది. ప‌క్ష‌వాతానికి కార‌ణ‌మ‌వుతుంది.

జేమ్స్ రామ్సే హంట్ (James Ramsay Hunt) అనే డాక్ట‌ర్ 1907లో ఈ వ్యాధిని గుర్తించారు. అందుకే దానికి ఆయ‌న పేరే పెట్టారు. చెవిమీద పెద్ద‌గా బొబ్బ‌లు వ‌స్తే దీన్ని herpes zoster oticus అనికూడా అంటారు. కాని బొబ్బ‌లుతోపాటు ముఖ ప‌క్ష‌వాతం క‌నిపిస్తే దాన్ని Ramsay Hunt syndrome అనిపిలుస్తారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి