iDreamPost

పెళ్లిలో అదిరిపోయే లుక్.. వరుడికి వెండి చెప్పులు, బెల్టు!

పెళ్లిలో అదిరిపోయే లుక్.. వరుడికి వెండి చెప్పులు, బెల్టు!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకోవాలని యువత కలలు కంటారు. అయితే  ఎవరి ఆర్ధిక స్థోమతను బట్టి వారు  పెళ్లి జరుపుకుంటారు. సామాన్యుల వివాహ వేడుకలు ఎలా ఉన్నా.. డబ్బున్న వాళ్లు జరుపుకునే పెళ్లి మాములుగా ఉండవు. డబ్బు ఉందంటే ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు జరుగుతుంది.  ఆ మాటలను నిజం చేస్తూనే ఓ పెళ్లి జంట ఏకంగా వెండి చెప్పులు చేయించుకుని, పెళ్లికి వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు.

ధనవంతులు వెండి చెప్పులు చేయించుకుంటారు. పెళ్లంటే ఆమాత్రం ఉండాలి కదా అనుకుంటున్నారేమో వధూవరులు వెండి చెప్పులు  ధరిస్తున్నారు. ఆ చెప్పులను కేవలం వెండితో  తయారు చేస్తే ఏం బాగుంటుందని ముత్యాలు, రత్నాలతో కూడా  డిజైన చేస్తున్నారు. తాజాగా అలాంటి వెండి చెప్పులను ధరించిన వధూవరులు అందరిని ఆశ్చర్య పరిచారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఉత్తర్ ప్రదేశ్  రాజధాని లఖ్ నవూలో వినోద్ మహేశ్వరి అనే నగల వ్యాపారీ.. ఈ వెండి చెప్పుల తయారికి శ్రీకారం చుట్టారు. వధూవరుల కోసం వెండితో ప్రత్యేకంగా పాదరక్షలను రూపొందించారు.  పెళ్లిలో వారు ధరించే నగలే కాకుండా చెప్పులను సైతం తళతళలాడేలా చేస్తున్నారు.

సదరు వ్యాపారి 300 నుంచి 500 గ్రాముల వెండితో చెప్పులు తయారు చేస్తున్నాడు. వెండిని బట్టి ఆ చెప్పుల ధర ఉంటుంది. వెండి చెప్పుల ప్రారంభ ధర రూ.25 వేసు ఉంటుందని ఆ వ్యాపారి తెలిపాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంతకంటే ఖరీదైన చెప్పులను వినియోగిస్తూ ఉంటారు. కస్టమర్ల నుంచి  మంచి స్పందన రావడంతో వరుడికి కావాల్సిన మిగతా వస్తువులనూ వెండితో రూపొందిస్తున్నారు. పాదరక్షలనే కాకుండా వరుడు ధరించే బెల్ట్ లనూ కూడా వెండితోనే తయారు చేస్తున్నారు. ఇక వీటి బరువు, మోడల్  ఆధారంగా ధర రూ.20 వేలుగా నిర్ణయించారు.  ఎటువంటి డిజైన్ కావాలంటే అటువంటి డిజైన్లు చెప్పులు తయారు చేసి ఇస్తామని తెలిపారు.

ప్రస్తుత కాలంలో పెళ్లి కొడుకు ఎక్కువగా షేర్వానీలు ధరిస్తున్నారు. అందుకే షేర్వానీకి తగిన డిజైన్ లో వరుడు ధరించే బెల్టును కూడా వెండితోనే తయారు చేస్తున్నారు. ఈ వెండి చెప్పులు, బెల్ట్.. చూసే వారందరినీ ఆకట్టుకుంటున్నాయి.  చాలామంది ఈ చెప్పులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నగల వ్యాపారి తెలిపారు. మరి.. ఈ వెండి చెప్పుల వాడకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పరమ శివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి