iDreamPost

పల్నాడు పై పచ్చ కన్ను, కుయుక్తులతో, అలజడులతో టీడీపీ బలపడే యత్నాలు

పల్నాడు పై పచ్చ కన్ను, కుయుక్తులతో, అలజడులతో టీడీపీ బలపడే యత్నాలు

దాయాదుల పోరుకి పెట్టింది పేరు పల్నాడు. చిన్న నిప్పురవ్వ దావానలం సృష్టించినట్టు చిన్న విభేదాలకే కొట్లాటలు, హత్యల దాకా వెళ్లిన ఘటనలు ఈ ప్రాంతంలో కోకొల్లలు. ఆది నుండి గ్రామ స్థాయి విభేదాలు ఎక్కువే అయినా విభేదాలు, కొట్లాటలు స్థాయి దాటి ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలకు బీజం పడింది మాత్రం 80 వ దశకం ఆరంభం నుండి అని చెప్పొచ్చు.

ఆ రోజుల్లో ఉద్భవించిన కొత్త రాజకీయ పార్టీ ఎదుగుదలకు గ్రామ స్థాయి వర్గ విభేదాలు బాగా తోడ్పాడ్డాయి. ముఖ్యంగా నరసరావుపేట కేంద్రంగా ఎదిగిన ఒక నాయకుడి ఆధ్వర్యంలో ఒక్క పేటలో మాత్రమే కాక పల్నాడు వ్యాప్తంగా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాక పార్టీ నిలబెట్టే అభ్యర్థులని సైతం శాసించే స్థాయికి ఎదగడం వెనక గ్రామగ్రామానా అతను విభేదాలని పెంచి పోషించి చేరదీసిన వర్గ విభేదాలే కారణం.

2004 తర్వాత ఈ పరిస్థితులు చాలా వరకూ మారాయి. ఫ్యాక్షన్ వలన దగ్గరి బంధువులనే చంపుకొని జైళ్ళ పాలయ్యిన వారిని, కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడ్డవారిని, వివాదాల వలన ఆర్ధికంగా నష్టపోయిన వారిని చూస్తూ పెరిగిన తర్వాతి తరం ఫ్యాక్షన్ కి, విభేదాలకీ దూరంగా జరగనారంభించింది. మారిన కాలానికి అనుగుణంగా విద్య ద్వారా పలు అవకాశాల్ని అందిపుచ్చుకొన్న యువత ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తుండగా, మెరుగైన వ్యవసాయ, అనుభంద రంగాలలో గ్రామీణ ప్రజానీకం స్థిరపడ్డారు .

ఇలా గత ఇరవై ఏళ్లుగా తగ్గుతూ దాదాపు కనుమరుగైన పల్నాడు ప్యాక్షన్ భూతం ఇటీవల మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలతో మళ్ళీ పడగ విప్పుతోందా అంటూ పల్నాడు ప్రజానీకం ఆందోళన చెందుతోంది . ఇందుకు ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మా రెడ్డిని నియమించడమే .

ఎవరీ బ్రహ్మా రెడ్డి

వీరి తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా మాచర్ల శాసనసభకి పోటీ చేసి విజయం సాధించగా 1983 లో గురజాల నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు , తల్లి దుర్గాoబ గారు 1999 లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు . 2001 మార్చ్ 10 లేదా 11 వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు హత్యల ఘోరకలిలో ఘటనలో జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన ముద్దాయి. ఆ హత్యల తర్వాత కూడా అతని నేర ప్రవృత్తి మార్చుకోకపోవడంతో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీ బ్రహ్మా రెడ్డిని గుంటూరు పోలీసు ప్రధాన కార్యాలయానికి రప్పించి పోలీస్ స్టైల్ లో మూడు రోజుల పాటు తీవ్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి చివరికి బ్రహ్మా రెడ్డి తల్లి దుర్గాంబ చంద్రబాబు ద్వారా చేసిన ప్రయత్నాలతో విడిచిపెట్టినట్టు అప్పటి ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి.

మాచర్ల నియోజకవర్గంలో వరుస విజయాలతో జోరు మీదున్న పిన్నెల్లి కుటుంబ హవా తట్టుకొని పోటీ ఇవ్వగల నాయకుల కోసం తీవ్రంగా అన్వేషించిన టీడీపీ నాయకత్వం సరైన అభ్యర్థి దొరక్క చివరికి మాజీ ఎమ్మెల్యే తనయుడు,రాజకీయంగా ఉనికిలో లేని ఫ్యాక్షన్ ముద్ర ఉన్న ఈ జూలకంటి బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించాడు చంద్రబాబు

జూలకంటి బ్రహ్మారెడ్డి రాజకీయ వారసత్వం కొంత ఆసక్తికరంగా కనబడ్డా,ఫ్యాక్షన్ నేపథ్యం,రాజకీయ చరిత్ర గమనిస్తే ఒడిదుడుకుల ప్రయాణం అని చెప్పవచ్చు. బ్రహ్మారెడ్డి వెల్దుర్తి మండల వాసి. ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగా, 1999 లో నాగిరెడ్డి సతీమణి జూలకంటి దుర్గాoబ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు ఫ్యాక్షన్ హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు జూలకంటి బ్రహ్మారెడ్డి.

జూలకంటి బ్రహ్మారెడ్డి సొంత బాబాయి హనిమి రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి సాంబిరెడ్డి కూడా వరసకి బ్రహ్మారెడ్డికి బాబాయి కావడం విశేషం.2001 మార్చి 10 వ తారీఖు కేసు వాయిదా నిమిత్తం జూలకంటి సాంబిరెడ్డి తన సహచరులతో నరసరావుపేట కోర్టుకి వెళ్లి వస్తుండగా దుర్గి మండలం ఆత్మకూరు వద్ద కాపు కాసిన బ్రహ్మారెడ్డి వర్గం సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న జీపుని లారీతో గుద్ది ఒక్కసారిగా చేసిన దాడిలో సాంబిరెడ్డి సహా ఏడుగురు మరణించారు.

ఈ హత్యల తర్వాత కొన్నాళ్ళు జైలు జీవితం గడిపి బయటికొచ్చిన బ్రహ్మా రెడ్డి తన నేర ప్రవృత్తి మార్చుకోకపోవడంతో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీ బ్రహ్మా రెడ్డిని గుంటూరు పోలీసు ప్రధాన కార్యాలయానికి రప్పించి పోలీస్ స్టైల్ లో మూడు రోజుల పాటు తీవ్రంగా కౌన్సిలింగ్ ఇచ్చి చివరికి బ్రహ్మా రెడ్డి తల్లి దుర్గాంబ చంద్రబాబు ద్వారా చేసిన ప్రయత్నాలతో విడిచిపెట్టినట్టు అప్పటి ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి
తరువాతి కాలంలో 2004,2009 అసెంబ్లీ ఎన్నికలలో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచినా ఫ్యాక్షన్ మరకల కారణంగా జనంలో ఏర్పడ్డ వ్యతిరేకతతో ఓటమి పాలయ్యి రాజకీయంగా కనుమరుగయ్యారు .

ఒక్క 2012 ఉప ఎన్నికలలో తప్ప ప్రతి ఎన్నికలోనూ పిన్నెల్లి కుటుంబానికి పోటీగా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన అభ్యర్థులను నిలబెడుతూ వచ్చింది టీడీపీ నాయకత్వం. 2012 ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా నిలిచి ఓటమి పాలైన చిరుమామిళ్ల మధు కూడా ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్‌ పదవి ఆశిస్తుండగా ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాతినిథ్యం కల్పించదలుచుకొన్న చంద్రబాబు ధీటైన అభ్యర్థి దొరక్క చివరికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న, ఏడు హత్యల కేసులో ముద్దాయి అయిన జూలకంటి బ్రహ్మారెడ్డిని ఎంచుకొన్నారు.

2004 ఎన్నికలలో మాచర్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెల్లి కుటుంబం నుండి లక్ష్మారెడ్డి విజయం సాధించారు, 2009 ఎన్నికలలో మారిన సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా లక్ష్మారెడ్డి సోదరుడి తనయుడు రామకృష్ణ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. నాటి నుండి జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాలు సాధిస్తూ పిన్నెల్లి కుటుంబం నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టుసాధించింది. గడిచిన స్థానిక ఎన్నికలలో మాచర్ల పరిధిలో టీడీపీ కనీసం వార్డు స్థాయిలో కూడా పోటీ అభ్యర్థులను నిలబెట్టలేేేకపోయింది.మున్సిపాలిటీ సహా పలు గ్రామ పంచాయతీలు పిన్నెల్లి వర్గీయులు ఏకగ్రీవంగా నెగ్గటం ఈ నియోజకవర్గంలో టీడీపీ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది.

ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి హవాని ఎదుర్కొని అస్తవ్యస్తమైన టీడీపీ పరిస్థితిని ఒక గాడిలో పెట్టగల అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న టీడీపీ అధినాయకత్వం సరైన నాయకుడు దొరక్క చివరికి రాజకీయంగా ఉనికిలో లేని, ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన జూలకంటి బ్రహ్మరెడ్డిని మళ్లీ తెర పైకి తీసుకొచ్చి మాచర్ల అసెంబ్లీ ఇంఛార్జ్‌గా ప్రకటించింది. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నాడన్న వార్తలతో పాటు, గత ప‌ద‌మూడేళ్లుగా నియోజకవర్గ రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండటంతో జూలకంటి వర్గం పూర్తిగా చెల్లాచెదురు అయిపోయింది.

2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి మాచర్ల, గురజాల నియోజకవర్గం వర్గాల్లో మిగిలి ఉన్న తన వర్గం ఓటింగ్ ఇరువురు అభ్యర్థులకు వేయిస్తానని అందుకు ప్రతిగా కొంత ఆర్ధిక లబ్ది కలిగించమని బ్రహ్మారెడ్డి కోరినట్లు పలు వార్తలు వచ్చినా ఫ్యాక్షన్ మరకలు ఉన్న కారణంగా మాచర్లలో పిన్నెల్లి కుటుంబం, గురజాల అభ్యర్థి కూడా సానుకూలంగా లేక ఈ ప్రయత్నం విఫలమయిందని సమాచారం.

ప్రస్తుతం ఆర్ధికంగా చితికిపోయిన బ్రహ్మారెడ్డికి రాజకీయ పునరావాసం కల్పించడంతో పాటు ఆర్ధికంగా కూడా పూర్తి అండదండలు అందిస్తామని అభయమిచ్చి బాబు తీసుకురావడానికి ప్రధాన కారణం బ్రహ్మారెడ్డి నేపధ్యం, తెంపరితనంతో చేసే చర్యలు, మళ్ళీ రగిలే ఫ్యాక్షన్ అలజడులను తన మీడియా ద్వారా తనకనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందడమే . ఈ కారణంగానే పలు హత్య కేసుల్లో, గొడవల్లో ముద్దయిగా ఉండి తన పాలనా కాలంలోనే జిల్లా స్థాయి పోలీస్ అధికారులు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా నిర్ధారించి మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించిన కరుడు గట్టిన నేరస్తున్ని తెచ్చి పల్నాడు నెత్తిన రుద్ది జిల్లాలో అలజడులకు కారణమయ్యారు చంద్రబాబు.

బాబు లక్ష్యాన్ని బ్రహ్మారెడ్డి చేరుకొన్న మేరకు అతనికి పలు ప్రయోజనాలు ఉంటాయి, ఇంచార్జ్ స్థానం సుస్థిరమయ్యి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం మెరుగవుతుంది. ఈ క్రమంలో భాగంగానే ఇటీవల గడపగడప కార్యక్రమంలో మాచర్లలో వ్యూహాత్మాకంగా జరిగిన అల్లర్లు గమనిస్తే భవిష్యత్తులో ఏమి జరగనుందో సూచనాప్రాయంగా అర్ధమవుతుంది . ఇలాంటి ప్రమాధాల్ని చట్టబద్దమైన పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉక్కుపాదంతో అణిచివేయకపోతే ముందు ముందు పల్నాడులో ఇలాంటి వివాదాలు, దుర్ఘటనలు మరిన్ని చూడాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రజలకు కలగవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఇదేం ఖర్మ కార్యక్రమంలో జరిగిన అల్లర్ల తర్వాత మాకు కత్తి తిప్పటం బాంబులేయడం బాగా తెలుసు అన్న బ్రహ్మా రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి