iDreamPost

Hyderabad: మందుబాబులకు అలర్ట్.. తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్

  • Published Dec 31, 2023 | 4:39 PMUpdated Dec 31, 2023 | 4:39 PM

డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు మందు బాబులకు అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..

డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు మందు బాబులకు అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 31, 2023 | 4:39 PMUpdated Dec 31, 2023 | 4:39 PM
Hyderabad: మందుబాబులకు అలర్ట్.. తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్

మరి కొన్ని గంటల్లో.. పాత ఏడాది 2023కి గుడ్ బై చెప్పి.. నూతన సంవత్సరం 2024 కి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని దేశాల ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక మన దగ్గర ఇయర్ ఎండ్, కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు కోసం నగరం ముస్తాబవుతోంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. మన దగ్గర మద్యం ఏరులై పారుతుంది. 31 రోజు లేచిన దగ్గర నుంచి తెల్లవార్లు.. మందు పార్టీలతో బిజీగా అవుతారు మందు బాబులు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరోసారి హెచ్చరించారు. ఆ వివరాలు..

31, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో.. నగరంలో తెల్లవార్లూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఇందుకోసం లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. అలానే ఈ సారి డ్రగ్ టెస్ట్ లు కూడా నిర్వహించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పరికరాలను తెప్పించినట్లు తెలుస్తోంది.

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికి ఇబ్బందులు కలగకుండా సెలబ్రేట్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాక ఇవాళ అనగా డిసెంబర్ 31, ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్‌డ్రైవ్‌ పరీక్షలు చేస్తామని నగర ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సైఫాబాద్‌, బేగంపేట్‌ తదితర చోట్ల డ్రంకెన్ డ్రైవ్ చేసేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇక ఇవాళ డిసెంబర్ 31, ఆదివారం రాత్రి నుంచి జనవరి 1, సోమవారం అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ (ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అలానే జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పైనా వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని చెప్పారు. అలానే డిసెంబర్ 31 న అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి