iDreamPost

మరోసారి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్! మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు..?

  • Author ajaykrishna Published - 11:12 AM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 11:12 AM, Tue - 11 July 23
మరోసారి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్! మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై అభిమానులలో అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్ వయిలెంట్ యాక్షన్ మూవీగా సలార్ వస్తుండగా.. సలార్ కి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంటుందని ఇటీవల టీజర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆల్రెడీ పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అయిన ప్రభాస్, ప్రశాంత్ కాంబో.. వీరి కాంబోలో సలార్ రెండు భాగాలుగా వస్తుందని తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సలార్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు కూడా సలార్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇక సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుండగా.. ఇది రిలీజైన ఆరు నెలలకు సలార్ 2 ని తీసుకురావాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ వచ్చాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరు నెలల్లో లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నాడట. అందుకోసం ఆల్రెడీ సలార్ 2 కి సంబంధించి మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా షూట్ చేసేసినట్లు సమాచారం. ఒకవేళ నిజంగా ప్రశాంత్ నీల్ ప్లాన్ గనక ఇదే అయితే.. ఖచ్చితంగా డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే. కానీ.. సలార్ తర్వాత ప్రశాంత్ మళ్లీ ప్రభాస్ తోనే సలార్ 2 చేస్తాడని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఎందుకంటే.. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే అధికారికంగా వీరి కాంబినేషన్ అనౌన్స్ కూడా అయింది. అయితే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత.. వెంటనే మళ్లీ ప్రభాస్ తో సలార్ 2 చేస్తాడని తెలిసి.. మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అని నందమూరి ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఆ సినిమా తర్వాత.. బాలీవుడ్ మూవీ వార్ సీక్వెల్ ‘వార్ 2’లో హృతిక్ రోషన్ తో చేతులు కలపబోతున్నాడు. ఈ లెక్కన ఎన్టీఆర్ వచ్చే ఏడాది వార్ 2తో బిజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. సో.. ప్రశాంత్ నీల్ సలార్ 2 కంప్లీట్ చేసేసరికి.. ఎన్టీఆర్ వార్ 2 ఫినిష్ చేసి రెడీగా ఉంటాడు. అప్పటిదాకా ఫ్యాన్స్ ఓపిక పట్టక తప్పదు. మరి సలార్ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి