iDreamPost

అందుకే NTR అంటే అంతగా అభిమానిస్తారు!

  • Published Apr 19, 2024 | 11:05 AMUpdated Apr 19, 2024 | 12:20 PM

Jr NTR Coach Birthday: తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు.

Jr NTR Coach Birthday: తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు.

  • Published Apr 19, 2024 | 11:05 AMUpdated Apr 19, 2024 | 12:20 PM
అందుకే NTR అంటే అంతగా అభిమానిస్తారు!

ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్ర అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి నటించి ప్రేక్షకులను మెప్పిస్తాడు. అందుకే ఎన్టీఆర్ ని తాతకు తగ్గ మనవడు అని అంటారు. రాజమౌళి దర్శకత్వంలో వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ప్రపంచ స్థాయిలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారిని గొప్పవారంటారు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎన్టీఆర్. తన అభిమానులు, ప్రేమించే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రతి ఈ వెంట్ లో అభిమానులను క్షేమంగా ఇంటికి వెళ్లండి అంటూ పదే పదే చెబుతుంటాడు.  తాజాగా ఎన్టీఆర్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎక్కడైనా యజమానులు తమ ఉద్యోగులను కేవలం ఉద్యోగస్థులుగానే చూస్తుంటారు. చాలా తక్కువ మంది తమ ఎంప్లాయీస్ ని సొంతవాళ్ల లాగా చూసుకుంటారు. అలాంటి వారిలో నందమూరి వారసుడు.. జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానుల కోసం ఎంతో చేసే ఎన్టీఆర్ తన వద్ద ఉన్న స్టాఫ్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాల్లో నటించాలంటే అంత సులభమైన విషయం కాదు.. ఆయనకు అన్ని విధాలుగా సహకరించే వాళ్లు తన పక్కను ఉండాలి. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి హీరో తమ కోసం ఓ ప్రత్యేకమైన ఫిట్ నెస్ స్టాఫ్ మెయింటేన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్2’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైను కొరటాల దర్శకత్వంలో పాన్ ఇండియాగా రాబోతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ రెండు చిత్రాలు భారీ యాక్షన్ చిత్రాలు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ తన శరీరాన్ని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందుకోసం తన ఫిట్నెస్ కోచ్ కుమార్ మన్నావ్ ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు. ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు. తన ఫిట్నెస్ కోచ్ మన్నావ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన వద్దకు వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అంత స్టార్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకకు రావడంతో మన్నావ్ ఉప్పి తబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అతనికి కేక్ తినిపించి సంతోషపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందుకే ఎన్టీఆర్ అంటే అభిమానులు అంతగా ప్రేమిస్తారు. అభిమానులను, నా అనుకున్న వారిని సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసే ఎన్టీఆర్ గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ అంటున్నారు. దట్ ఈజ్ ఎన్టీఆర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి