iDreamPost

రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!

రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!

ఈ కథ ఇప్పటిది కాదు.. దాదాపు 37 ఏళ్ల క్రితం మొదలైంది. ఈ కథలో హీరో పేరు జాన్‌ వార్డ్‌. ఇంగ్లాండ్‌కు చెందిన ఆయన వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌గా పనిచేసేవాడు. జాన్‌ వార్డ్‌కు జూలీ వార్డ్‌ అనే కూతురు ఉండేది. జూలీ వార్డ్‌ అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. చదువు అయిపోగానే జూలీ బరీ సెయింట్‌ ఎడ్మండ్స్‌లోని పబ్లిషింగ​ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అప్పటికి ఆమె వయసు 28 సంవత్సరాలు. కానీ, తండ్రి బాటలో నడవాలనుకున్న ఆమె వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ కోసం కెన్యాకు వెళ్లింది. ఆమె కెన్యా పర్యటనలో ఉండగానే కనిపించకుండాపోయింది. తర్వాత ఆమె చనిపోయిందన్న వార్త జాన్‌కు అందింది.

దీంతో ఆయన కెన్యా వెళ్లిపోయాడు. అక్కడి అధికారులు జూలీ జంతువుల దాడిలో చనిపోయిందని చెప్పారు. ఆమె డెడ్‌ బాడీని కూడా ఇవ్వలేదు. దీంతో జాన్‌కు ఏదో సందేహం కలిగింది. కూతురు ఏమైందో అన్వేషించడానికి డిటెక్టివ్‌ అవతారం ఎత్తాడు. ఫోరెన్సిక్‌కు సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకుని రంగంలోకి దిగాడు. కూతురి మృతదేహం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ఐదు విమానాలతో కూతురు తిరిగిన ప్రాంతంలో జల్లెడపట్టించాడు. ఎట్టకేలకు జూలీ దవడ, ఎడమ కాలు తదితర భాగాలు దొరికాయి. కూతురు ఎలా చనిపోయిందో పరిశోధన మొదలుపెట్టాడు. ఆ పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అప్పటి కెన్యా అధ్యక్షుడి కుమారుడు జొనాథన్‌ మోయి జూలీని రేప్‌ చేసి చంపినట్లు గుర్తించాడు. అయితే, అతడే జూలీని చంపాడనడానికి ఎలాంటి ఆధారాలు జాన్‌ దగ్గరలేవు. అయినా కెన్యా ప్రభుత్వంతో పోరానికి దిగాడు. 37 ఏళ్లనుంచి పోరాటం చేస్తున్నాడు. డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడు. 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అయినా లాభం లేకపోయింది. 79 ఏళ్ల వయసులో జాన్‌ చనిపోయాడు. అయితే, తండ్రి ఆశయాన్ని తాము కొనసాగిస్తామని, జూలీకి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని ఆమె సోదరుడు అంటున్నారు. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి