iDreamPost

Ashes 2023: ఔటయ్యి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్! టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

  • Author Soma Sekhar Published - 02:45 PM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 02:45 PM, Tue - 20 June 23
Ashes 2023: ఔటయ్యి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్! టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. హోరాహోరిగా సాగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆసిస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే చేసింది 46 పరుగులే అయినప్పటికీ రూట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

జో రూట్.. సమకాలీన టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలకడైన ఆటగాడిగా మంచి గుర్తింపు పొందాడు. తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడంలో దిట్ట రూట్. తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో.. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్నాడు రూట్. దాంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు రూట్. ఈ క్రమంలోనే నాథన్ లియోన్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు రూట్. ఇక రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్ అయిన రెండో ఆటగాడిగా రూట్ నిలిచాడు.

ఇక తొలి స్థానంలో విండీస్ దిగ్గజం చంద్రపాల్ 11,414 పరుగులతో ఉన్నాడు. మూడో స్థానంలో గ్రేమ్ స్మిత్ 8800 పరుగులతో ఉండగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ 8195, సచిన్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయ్యి నాలుగు, ఐదు ప్లేసుల్లో నిలిచారు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే నిలిచాడు. అతడు టెస్టుల్లో 11,814 రన్స్ చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాకపోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి