iDreamPost

హైదరాబాద్ కి చేరుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు..

Jharkhand politics in Hyderabad: హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది.. ప్రస్తుతం జార్ఖండ్‌ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మరినట్లు తెలుస్తుంది.

Jharkhand politics in Hyderabad: హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది.. ప్రస్తుతం జార్ఖండ్‌ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మరినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ కి చేరుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు..

దేశంలో ఇప్పుడు అందరి చూపు జార్ఖండ్ వైపే ఉంది. గత రెండు రోజులుగా జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవించాయి. జనవరి 31 న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించడం.. ఆ తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయడం.. జార్ఖండ్ కి నూతన ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేయడం చక చకా జరిగిపోయాయి.  హేమంత్ సోరెన్ కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హైదరాబాద్ లో జార్ఖండ్ రాజకీయం ఊపందుకుంది. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ రాజకీయాల్లో హీట్ పెరిగింది. భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో శాసన సభాపక్ష నేతగా ఉన్న చంపై సోరెన్ సీఎం గా ఎన్నుకున్నారు. ఇందుకు  జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ  ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే పది రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ రాధాకృష్ణన్.. చంపై తో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయంచారు.  తమ ఎమ్మెల్యేలు చేజారకుండా.. ప్రభుత్వం మారకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దలు రేవంత్ రెడ్డికి పలు కీలక సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించి వారితో మంతనాలు జరిపే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాంచి బిర్సా ముండా ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అటు నుంచి గచ్చిబౌలిలో హూటల్ ఎల్లోలా జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ప్రత్యేక వసతి కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యేవరకు హైదరాబాద్ క్యాంపులోనే ఎమ్మెల్యేలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ అయిన సంపత్ కు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జార్ఖండ్ రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి