iDreamPost

భర్త కష్టపడి భార్యను చదివించాడు.. కానీ భార్య ఏం చేసిందో తెలుసా?

భర్త కష్టపడి భార్యను చదివించాడు.. కానీ భార్య ఏం చేసిందో తెలుసా?

పైన ఫొటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరు దంపతులు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇకపోతే, కన్నయ్య పెద్దగా చదువుకోకపోయినా.. అతని భార్య మాత్రం కొంత వరకు చదువుకుంది. మరిన్ని పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది ఈమె కళ. ఇక భార్య కోరిక మేరకు భర్త కూలీ పని చేసి భార్యను బాగా చదివించాడు. కానీ, భార్య మాత్రం చివరికి భర్తకు ఊహించని షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?

జార్ఖండ్ లోని భంజీబజార్ లో కన్నయ్య-కల్పన దంపలులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన పిల్లాడిని చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కన్నయ్య పెద్దగా చదువుకోకపోయినా అతని భార్య కల్పన మాత్రం కొంత వరకు చదువుకుంది. మరిన్ని ఉన్నత చదువులు పూర్తి చేసి ఏదైన ఉద్యోగంలో స్థిరపడాలని అనుకునేది. కల్పన ఇదే విషయాన్ని తన భర్తకు వివరించింది. భార్య కోరికను కాదనని భర్త.. కూలీ పని చేస్తూ దాదాపు రూ.2 లక్షలు కట్టి భార్యను నర్సింగ్ చదివించాడు.

భార్యకు ఉద్యోగం వస్తే ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత సంతోషంగా ఉండొచ్చని భర్త కన్నయ్య అనుకున్నాడు. ఇటీవల కల్పన నర్సింగ్ కోర్సు కూడా పూర్తైంది. కట్ చేస్తే.. కోర్సు పూర్తైన వెంటనే కల్పన తన కుమారుడిని వెంట తీసుకుని కనిపించకుండాపోయింది. భార్య, కుమారుడు కనిపించకపోవడంతో భర్త అంతటా వెతికాడు. వారి జాడ మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియక భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. కన్నయ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి