iDreamPost

జగన్ ఈజ్ రైట్ అంటున్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .

జగన్ ఈజ్ రైట్ అంటున్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .

కరోనా ఇప్పట్లో పోయేది కాదు కొన్నాళ్లు మనం దానితో కలిసి జీవించక తప్పదు అని జగన్ భవిష్యత్తు మీద స్పష్టంగా మాట్లాడిన అంశాన్ని చంద్రబాబు,ఇతర టీడీపీ నేతలు ఎద్దవా చేస్తూ .. జగన్ చేతులెత్తేశాడు అంటూ రాజకీయ విమర్శలకు దిగారు. అదే రోజు ప్రధాని మోడీ కూడా జగన్ లాగానే అభిప్రాయపడ్డారు కానీ టీడీపీ నేతలు రాజకీయ దాడికి ప్రాధాన్యతనిచ్చి విమర్శలకు దిగారు.

అయితే ఈరోజు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని చెప్తూ,కరోనా అన్నది లాక్ డౌన్ ఎత్తేయగానే ఆగిపోయే విషయం కాదు . దాని వాక్సిన్ ఇంకా కనుగొనలేదు . ఇప్పటివరకూ ఏ విధమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్ లేదని ICMR వాళ్ళు చెబుతున్నారు . కనుక ఇది ఇప్పట్లో ఆగిపోయే సమస్య కాదు . ఇది కొనసాగబోతుంది . మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మనకు ఆవహిస్తుంది కాబట్టి లాక్ డౌన్ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ కోణంలోనే జగన్ కొంతకాలం మనం కరోనాతో కలిసి జీవించాలి కనుక జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు హీ ఈజ్ రైట్ అని మాజీ జేడీ అన్నారు .

జగన్ తో రాజకీయంగా విభేదించే జేడీ లక్ష్మీనారాయణ కరోనా ప్రభావం మీద నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పటం ,జగన్ సూచన సరైందే అని చెప్పటం టీడీపీ నేతలకు చెంపపెట్టు. విపత్తు వేళ రాజకీయాలు వొద్దు అంటూనే నిత్యం రాజకీయ దాడికి దిగుతున్న చంద్రబాబు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారి అభిప్రాయాన్ని చూసిన తరువాతనైనా మనసు మార్చుకొని దుష్ప్రచారం మానుకోవాలి,ప్రజలను జాగర్తగా ఉండమని చెప్పాలి.

అదే చర్చలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా ఒక జ్వరం లాంటిది జాగ్రత్తగా ఉండి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోతుంది అన్న జగన్ వ్యాఖ్యల పై స్పందిస్తూ సాధారణంగా మన ఇంట్లో వాళ్ళు అనారోగ్యం పాలైతే ఇదేం పెద్ద సమస్య కాదు జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది అని ధైర్యం చెబుతాం . అలాగే గత మూణ్ణెళ్ల నుండి కరోనా గురించి వార్తలు వింటూ భయపడి ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం కరోనా సమస్య ఎదుర్కొంటున్న వారికి ధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడే ప్రయత్నం ఇది అని విశ్లేషించారు .

అలాగే జోన్స్ వారీగా విభజించి టెస్ట్స్ సంఖ్య పెంచి వైరస్ బాధితుల్ని సత్వరం గుర్తించి వైద్య సహాయం అందించడం కూడా మంచి పరిణామమని దేశ వ్యాప్తంగా చూస్తే ప్రతి మిలియన్ కు 453 టెస్ట్స్ చేస్తుంటే అదే మన ఆంధ్ర ప్రదేశ్ ని పరిగణనలోకి తీసుకొంటే ప్రతి మిలియన్ కి 1400 పైగా టెస్ట్స్ చేస్తున్నారని ఇందు వలన సంఖ్య పెరిగినట్టు కనపడ్డా ఆందోళన చెందాల్సిన పని లేదని ,ఈ విషయాన్ని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గవ్వా  కూడా చెప్పారని గుర్తు చేస్తూ అంతిమంగా ఎక్కువ టెస్ట్స్ ద్వారా సంఖ్య పెరిగినట్టు కనపడ్డా ఇది వైరస్ మూలాలు , ప్రభావ పరిధి పూర్తిగా గుర్తించి అదుపు చేయడానికి తోడ్పడుతుందని ఈ దిశగా జగన్ ప్రభుర్వం సరైన దిశలోనే చర్యలు తీసుకొంటుంది అని హీ ఈజ్ రైట్ అని వ్యాఖ్యానించారు .

ఏదేమైనా జగన్ కేసుల విచారణ అధికారిగా అత్యంత వివాదాస్పదంగా బాబుకి అనుకూలంగా ప్రవర్తించాడు అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద CBI మాజీ జేడీ నుండి కూడా ప్రశంసలు అందుకోవడం కరోనా సమస్య పై జగన్ పనితీరుకు గీటురాయిగా , చంద్రబాబుకి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి