iDreamPost

Jayeshbhai Jordaar movie review జయేష్ భాయ్ జోర్దార్ రిపోర్ట్

Jayeshbhai Jordaar movie review జయేష్ భాయ్ జోర్దార్ రిపోర్ట్

అసలే సరైన స్ట్రెయిట్ హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్ నుంచి ఇవాళ మరో కొత్త సినిమా వచ్చింది. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఏమంత బజ్ లేకుండా ఏకంగా మూడు వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. యష్ రాజ్ సంస్థ నిర్మాణం అయినప్పటికీ దీని ప్రమోషన్ విషయంలో నిర్మాతలు ఏమంత శ్రద్ధ తీసుకోలేదు. దానికి తోడు ట్రైలర్ కూడా సోసోగా అనిపించడం ప్రేక్షకులు థియేటర్ల దాకా వెళ్లేందుకు ఏమంత ఆసక్తి చూపించలేదని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అర్థమైపోయింది. మౌత్ టాక్ మీదే ఆధారపడి ఓటిటికి వెళ్లకుండా సాహసం చేసిన ఈ డిఫరెంట్ ఎంటర్ టైనర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం

గుజరాత్ లోని చిన్న కుగ్రామంలో ఉంటాడు జయేష్ బాయ్(రణ్వీర్ సింగ్). భార్య ముద్ర(షాలిని పాండే), 9 ఏళ్ళ కూతురితో కలిసి నాన్న(బోమన్ ఇరానీ) కనుసన్నల్లో బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపే సగటు భయస్తుడి మనస్తత్వం అతనిది. వారసుడు ఉంటేనే కుటుంబమని భావించే చాదస్తపు తలితండ్రులతో అవే భావాలతో ఉండే ఊరివాళ్ల నుంచి పలురకాల ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటాడు. మరి కొడుకు లేని జయేష్ భాయ్ ఈ వ్యవస్థకు ఎలా ఎదురొడ్డి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, అర్థం లేని సంప్రదాయాలతో ఆడ మగా తేడాలంటూ కొట్టుమిట్టాడే వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేదే తెరమీద చూడాల్సిన స్టోరీ.

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని మీడియం బడ్జెట్ సినిమాలతో దం లగా కే ఐసాతో బాక్సాఫీస్ అద్భుతాలు చేసిన యష్ నిర్మాతలు స్టోరీ పరంగా ఎగ్జైట్ అయిపోయి దీన్ని తెరకెక్కించారు కానీ అసలు స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా అని చెక్ చేసుకోలేదు. దీంతో జయేష్ భాయ్ జోర్దార్ ఉన్నది రెండు గంటలే అయినా విపరీతంగా బోర్ కొట్టిస్తాడు. రణ్వీర్ సింగ్ తన శాయశక్తులా పెర్ఫార్మన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ దర్శకుడు దివ్యంగ్ టక్కర్ చేసిన ఖరీదైన పొరపాట్లకు ఫ్లాప్ అనే మూల్యం చెల్లించాడు. అన్ని విభాగాలు సినిమా ఎలా ఉండకూడదో నిరూపించాలనే ప్రయత్నం ఫైనల్ గా దెబ్బ కొట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి