iDreamPost

పరీక్ష లేకుండా.. నవోదయ స్కూల్స్‌లో భారీగా టీచర్‌ పోస్టులు.. త్వరపడండి

  • Published Apr 22, 2024 | 1:14 PMUpdated Apr 22, 2024 | 1:19 PM

Navodaya Vidyalaya Samiti: నవోదయ పాఠశాలలో భారీ ఎత్తున​ ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..

Navodaya Vidyalaya Samiti: నవోదయ పాఠశాలలో భారీ ఎత్తున​ ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 22, 2024 | 1:14 PMUpdated Apr 22, 2024 | 1:19 PM
పరీక్ష లేకుండా.. నవోదయ స్కూల్స్‌లో భారీగా టీచర్‌ పోస్టులు.. త్వరపడండి

నేటి కాలంలో ప్రైవేటు జాబ్‌ రావాలన్నా సరే.. పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చిన్నదైనా సరే గవర్నమెంట్‌ జాబ్‌ రావాలంటే.. కచ్చితంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.. మెరిట్‌ మార్కులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత కొన్ని సార్లు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. అన్ని వడపోతలు దాటితే.. ఉద్యోగం వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా పరీక్షలు నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఉద్యోగం పొందాలంటే పరీక్ష తప్పనిసరి అయిన నేటి కాలంలో.. ఎలాంటి ఎగ్జామ్‌ లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్‌ లభించనుంది. నవోదయ పాఠశాలల్లో భారీ ఎత్తున టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫి​​కేషన్‌ విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీటికి ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌).. భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 26 చివరితేది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మొత్తం టీచర్‌ పోస్టులు : 500

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులు: 283

  • సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులు: 217

  • సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.
  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

ఈ పోస్టులకు సంబంధించి ముఖ్య సమాచారం :

  • వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250.. టీజీటీలకు రూ.40,625గా నిర్ణయించారు.
  • ఏజ్‌ లిమిట్‌: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
  • ఎంపిక విధానం: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి