iDreamPost

VIDEO: పాక్‌ బౌలర్ల ఇజ్జత్ తీసిన బుమ్రా! కోహ్లీ రియాక్షన్‌ చూడండి

  • Published Sep 02, 2023 | 9:19 PMUpdated Sep 02, 2023 | 9:31 PM
  • Published Sep 02, 2023 | 9:19 PMUpdated Sep 02, 2023 | 9:31 PM
VIDEO: పాక్‌ బౌలర్ల ఇజ్జత్ తీసిన బుమ్రా! కోహ్లీ రియాక్షన్‌ చూడండి

ఆసియా కప్‌ 2023లో భాగంగా జరుగుతున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌లో కొన్ని మెరుపులు మెరిపించాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ దారుణంగా విఫలమైన చోట ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా రాణించారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలతో టీమిండియాను మ్యాచ్‌లో నెలబెట్టారు. అయితే.. ఇద్దరూ కూడా సెంచరీకి చాలా చేరువగా వచ్చి అవుట్‌ కావడం క్రికెట్‌ అభిమానులను నిరాశపర్చింది. ఇషాన్‌ 82, పాండ్యా 87 పరుగులు చేసి.. అవుట్‌ అయ్యారు. వాళ్లు ఉన్నంత వరకు టీమిండియా 300 ప్లస్‌ స్కోర్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ, వాళ్లిద్దరూ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు పడిపోయి.. 266 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది.

అయితే.. చివర్లో టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆల్‌రౌండర్‌ అవతారమెత్తాడు. టీమిండియా స్టార్‌ బ్యాటర్లైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌లను పరుగులు చేయకుండా పెవిలియన్‌ పంపిన పాకిస్థాన్‌ పేస్‌ దళాన్ని బుమ్రా భయపెట్టాడు. వాళ్ల పేస్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా.. అప్పటి వరకు నిప్పులు చెరిగిన వారిని చిన్నబోయేలా చేశాడు. ముందు షాహీన్‌ షా అఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ రెండో బంతికి బుమ్రా సూపర్‌ షాట్‌ ఆడాడు. మిడ్‌ ఆన్‌ మీదుగా గాల్లోకి భారీ షాట్‌ కొట్టాడు. అది బౌండరీ లైన్‌ వద్ద రెండు స్టెప్పులు పడి ఫోర్‌గా వెళ్లింది.

ఇక దాని తర్వాత వంతు హరీస్‌ రౌఫ్‌. గంటకు 146 కిలో మీటర్ల కళ్లు చెదిరే వేగంతో బంతి విసిరాడు రౌఫ్‌. దాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా ఎక్స్‌ట్రా కవర్స్‌లోకి అద్భుతమైన షాట్‌ ఆడాడు. అసలు ఆ షాట్‌ చూస్తే నిజంగా బుమ్రానే ఆడాడా అనే డౌట్‌ వచ్చేలా ఉంది. బుమ్రా ఆడిన ఆ షాట్‌ చూసి.. పాక్‌ పేసర్‌ రౌఫ్‌ షాక్‌ తిన్నాడు. ఇక ఫైనల్‌ టచ్‌ నసీమ్‌ షాకు ఇచ్చాడు బుమ్రా.. నసీమ్‌ షా వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌ నాలుగో బంతిని మిడ్‌ ఆఫ్‌ దిశగా అద్భుతమైన బౌండరీ బాదాడు. గంటకు 139 పరుగుల వేగంతో వచ్చిన బంతిని బుమ్రా సూపర్‌గా బౌండరీ లైన్‌కు తరలించాడు.

దురదృష్టవశాత్తు తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి.. బౌండరీ లైన్‌ వద్ద సల్మాన్‌ క్యాచ్‌ అందుకోవడంతో అవుట్‌ అయ్యాడు. అయితే.. బుమ్రా కొట్టిన షాట్లను చూసి డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న కోహ్లీ సైతం ఆశ్చర్యపోతూ.. ఆ షాట్లను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా కొట్టిన షాట్లకు కోహ్లీ చేసుకున్న సెలబ్రేషన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తం మీద బుమ్రా 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. అయితే బుమ్రా ఆడుతున్న సేపు ఫ్యాన్స్‌ను ఎంటటైన్‌ చేశాడు. మరి బుమ్రా కొట్టిన షాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి