iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

సోమవారం వరుసగా మరణ వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు మృత్యువాత పడ్డారు. మాజీ మంత్రి యేర్నని సీతాదేవి మరణించారన్న వార్త వచ్చింది. అంతలో ప్రముఖ దర్శకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.

సోమవారం వరుసగా మరణ వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు మృత్యువాత పడ్డారు. మాజీ మంత్రి యేర్నని సీతాదేవి మరణించారన్న వార్త వచ్చింది. అంతలో ప్రముఖ దర్శకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

సినీ, రాజకీయ దిగ్గజాలు నేలరాలుతున్నాయి. ఐదు నెలలు పూర్తి కాకుండానే పలువురు కన్నుమూసిన సంగతి విదితమే. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఇద్దరు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యేర్నేని సీతాదేవి హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోమవారం ఉదయం మృతి చెందిన సంగతి విదితమే. అలాగే స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు మరో సినీ దర్శకుడు.. ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచి.. తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయాడు.

ప్రముఖ దర్శకుడు సూర్య ప్రకాష్.. గుండె పోటులో సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని కోలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ వేత్త శరత్ కుమార్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని దర్శకుడు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. మాణిక్కం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సూర్య ప్రకాష్.. ఆ తర్వాత శరత్ కుమార్ హీరోగా మాయి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక తెలుగులో కూడా ఆయన ఒక్క సినిమానే చేశాడు. రాజశేఖర్, మీనా హీరో హీరోయిన్లుగా వచ్చిన భరత సింహా రెడ్డి మూవీకి దర్శకుడు ఆయనే.

2002లో విడుదలైంది ఈ చిత్రం. ఓకే అనిపించుకుంది. ఇందులో గజాల, రవళి కీలక పాత్రలు పోషించారు. మళ్లీ శరత్ కుమార్‪తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కిరణ్ రాథోడ్, శరత్ కుమార్ హీరో హీరోయిన్లుగా దివాన్ అనే చిత్రాన్ని రూపొందించాడు. 2015లో అధిబర్ అనే చిత్రానికి మెగా ఫోన్ పట్టాడు సూర్య ప్రకాష్. అంతకు ముందు వరుసనాడు అనే విలేజ్ రొమాన్స్ చిత్రం చేశాడు. తన కజిన్ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇంకా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. అంతకు ముందు కూడా ప్రభు కోసం ఓ సినిమాకు పని చేశాడు. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి