iDreamPost

విద్యార్థులకు కేంద్రం స్కాలర్ షిప్! తప్పక వస్తుంది! ఇలా అప్లై చేసుకోండి!

National Scholarship Scheme: ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలప్ షిప్ ను విద్యార్థులకు అందిస్తుంది. ప్రభుత్వ  పాఠశాల్లో ప్రతిభవంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్ పిష్ ను కేంద్ర అందిస్తుంది. ఈ ఏడాది కూడా ఎన్ఎస్పీ స్కాలర్ షిప్ కి నోటిఫికేషన్ విడుదలైంది.

National Scholarship Scheme: ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలప్ షిప్ ను విద్యార్థులకు అందిస్తుంది. ప్రభుత్వ  పాఠశాల్లో ప్రతిభవంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్ పిష్ ను కేంద్ర అందిస్తుంది. ఈ ఏడాది కూడా ఎన్ఎస్పీ స్కాలర్ షిప్ కి నోటిఫికేషన్ విడుదలైంది.

విద్యార్థులకు కేంద్రం స్కాలర్ షిప్! తప్పక వస్తుంది! ఇలా అప్లై చేసుకోండి!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అనేక ప్రోగ్రామ్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలానే విద్యార్థులక చదువులకు ఆర్ధిక భరోసాను ఇచ్చే కార్యక్రమాలను చేపడుతున్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు  స్కాలర్ పిష్ లకు కూడ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా విద్యార్థులకు జాతీయ స్కాలర్ షిప్ ను అందిస్తుంది. ఇక ఈ బెనిఫిట్స్ పొందాలనుకునే వారు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(NSP) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే ఎన్ఎస్పీ 2024 స్కాలర్ షిప్ కు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో ఈ నోటిఫికేషన్ తుది గడవు ముగియనుంది. మరి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలప్ షిప్ ను విద్యార్థులకు అందిస్తుంది. ప్రభుత్వ  పాఠశాల్లో ప్రతిభవంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్ పిష్ ను కేంద్ర అందిస్తుంది. ఏటా ఎంతో మంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ స్కాలర్ షిప్ ను పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ ఏడాది కూడా నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.  మరికొద్ది రోజుల్లోనే తుది గడువు ముగియనుంది. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ నుండి స్కాలర్‌షిప్ పొందేందుకు దరఖాస్తు ఆహ్వానంకు కొత్త నోటీపికేషన్ జారీ  అయ్యింది. ఇక ఆన్ లైన్ విధానంలో ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వం సూచించిన  అర్హతలు కలిగి ఉండాలి

Central GOVT scholarship

అర్హతలు:

  • విద్యార్థి భారత పౌరుడై ఉండాలి.
  • విద్యార్థి మునుపటి తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
  • విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు

ఎన్ఎస్పీ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:

  • బ్యాంక్ పాస్ బుక్,
  • వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్
  • అడ్రెస్ ఫ్రూప్
  • మార్కుల మెమో
  • పాస్ పోర్టు సైజ్ ఫోటో

దరఖాస్తు విధానం:

ఈ స్కాలర్ షిప్  కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో కనిపించే ఫారమ్ లో అడిగిన వివరాలు నింపిన తరువాత సబ్బిట్ బటన్ పై క్లిక్  ఓకే చేయండి. చివర్లో  మీరు రసీదుని పొందడానికి సంబంధించిన ఆప్షన్ పై క్లిక్ చేయండి. చివరగా మీకు రసీదు వస్తుంది. దాని ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

  • ప్రారంభ తేదీ:01-05-2024
  • చివరి తేదీ: 31-05-2024

మొత్తంగా ఈ ఏడాదికి గాను ఎన్ఎస్పీ స్కాలర్ పిష్ నోటీపికేషన్ విడుదలైంది. మరో మూడు రోజుల్లో ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు త్వరగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు  https://scholarships.gov.in/ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి