iDreamPost

IPL వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం.. SRH ఫ్యాన్స్​ తలెత్తుకుంటారు!

  • Published May 27, 2024 | 12:48 PMUpdated May 27, 2024 | 1:01 PM

ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. దీని గురించి తెలిస్తే సన్​రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తలెత్తుకుంటారు.

ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. దీని గురించి తెలిస్తే సన్​రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తలెత్తుకుంటారు.

  • Published May 27, 2024 | 12:48 PMUpdated May 27, 2024 | 1:01 PM
IPL వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం.. SRH ఫ్యాన్స్​ తలెత్తుకుంటారు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ ముగిసింది. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన సన్​రైజర్స్ హైదరాబాద్ చివరి మెట్టు మీద బోల్తా పడింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్​లో కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 8 వికెట్ల తేడాతో కమిన్స్ సేనను ఓడించి నయా ఛాంపియన్​గా అవతరించింది కోల్​కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన ఎస్​ఆర్​హెచ్.. 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆఖర్లో కెప్టెన్ కమిన్స్ (24) పోరాడకుంటే ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన కోల్​కతా 10.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్​ను రీచ్ అయింది. గెలిచిన కేకేఆర్ కప్పును కైవసం చేసుకోగా.. ఓడిన ఎస్​ఆర్​హెచ్ రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఇక, ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది.

ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సీజన్​లో ఏ ఇతర గ్రౌండ్​కు దక్కని గౌరవం ఇది. అత్యుత్తమ పిచ్​ను రూపొందించినందుకు గానూ బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ పురస్కారం ఉప్పల్ స్టేడియానికి దక్కింది. ఈ అవార్డు కింద ప్రోత్సాహకంగా రూ.50 లక్షల నగదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ)కు లభించింది. ఈ పురస్కారాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరినాథ్​ నుంచి హెచ్​సీఏ ప్రెసిడెంట్ జగన్​మోహన్ రావు అందుకున్నారు. దీనిపై సన్​రైజర్స్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన జట్టు ఫైనల్ వరకు వెళ్లడం, మరోవైపు ఉప్పల్ స్టేడియానికి అవార్డు దక్కడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఇక, ఈ సీజన్​లో 7 మ్యాచులకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అతిథ్యం ఇచ్చింది.

Uppal Stadium

ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఏడు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్-సన్​రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన వల్ల రద్దయింది. మిగిలిన మ్యాచులన్నీ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో మినహా మిగిలిన అన్నింటా ఎస్​ఆర్​హెచ్ విజయబావుటా ఎగురవేసింది. ఉప్పల్​లో భారీ స్కోర్లు నమోదు కావడం, ఒకదాన్ని మించి మరొకటి ఆసక్తికరంగా మ్యాచులు సాగడం తెలిసిందే. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ హవా నడవడానికి ఈ గ్రౌండ్​ ఎంతో హెల్ప్ అయింది. హోమ్ మ్యాచెస్​లో భారీ విజయాలు సాధించడం వల్లే జట్టును చూసి ప్రత్యర్థులు భయపడ్డారు. ఇదే జోరును ఇతర వేదికల్లోనూ కొనసాగించి ఏకంగా ఫైనల్స్​కు చేరుకుంది కమిన్స్ సేన. మరి.. ఉప్పల్ స్టేడియానికి అవార్డు దక్కడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by C/O.Controversy (@controversyy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి