iDreamPost

అక్కడ పందులతో హగ్గింగ్, సెల్ఫీలు.. అరగంటకు ఏకంగా వేలల్లో ఛార్జ్!

Hugging and Selfies with Pigs: సాధారణంగా ఇళ్లలో కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకుంటారు.. వాటిని అల్లారుముద్దుగా సాకుతారు. కొన్ని దేశాల్లో పందులను కూడా పెంచుకుంటారు.

Hugging and Selfies with Pigs: సాధారణంగా ఇళ్లలో కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుకుంటారు.. వాటిని అల్లారుముద్దుగా సాకుతారు. కొన్ని దేశాల్లో పందులను కూడా పెంచుకుంటారు.

అక్కడ పందులతో హగ్గింగ్, సెల్ఫీలు.. అరగంటకు ఏకంగా వేలల్లో ఛార్జ్!

జంతువులకు మనుషులకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మనుషులు పెంచుకునే కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు బాగా మచ్చిక అవుతాయి. తమ యజమానికి పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తాయి. కుక్కలు మనుషుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి.. తమ యజమానికి ఏ చిన్న ఆపద వచ్చినా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటాయి. ఇటీవల తమ పెట్స్ కి పుట్టిన రోజు, వివాహాలు, సీమంతాలు కూడా చేస్తున్నారు. సాధారణంగా కుక్కలు, పిల్లలు, ఆవులనే కాదు కొన్ని ప్రాంతాల్లో పందులను కూడా పెంచుకుంటారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు. తాజాగా ఓ దేశంలో పందులకు ప్రత్యేక కేఫ్ నడిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జపాన్ దేశంలో కుక్కలు, పిల్లలు మాత్రమే కాదు.. పందులకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ పందులను ఓ కేఫ్ లో ప్రత్యేకంగా పెంచుతున్నారు.  పందులను చూడటానికి జనాలు క్యూ కడుతున్నారు. అంతేకాదు వాటితో సెల్ఫీలు తీసుకుంటూ.. హగ్గులు ఇస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన జనాలు పందులతో కాసేపు సేద తీరితే ఎంతో రిలాక్స్ గా ఉంటుందని అటున్నారు. సెల్పీలు తీసుకున్నందుకు కొంతమ డబ్బు కూడా చెల్లిస్తున్నారు. మిపిగ్ కేఫ్ అనే పేరుతో ఈ కేఫ్ ని రన్ చేస్తున్నారు. జపాన్ లో కొంతమంది పందులను ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇక్కడ పందులకు ప్రత్యేకంగా మిపిగ్ అనే పేరుతో ఓ కేఫ్ బాగా పాపులర్ అయ్యింది. చాలా మంది జనాలు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

మిపిగ్ కేఫ్ కి వస్తున్న జనాలు పందులతో కొద్దిసేపు గడపడం వల్ల ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. ఉదయం నుంచి ఈ కేఫ్ లో పదుల సంఖ్యల్లో జనాలు వస్తున్నారు. పందులతో సెల్ఫీలు, ఆడుకోవడం, హగ్గులు ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇక్కడ పందులు ఎక్కువగా గురక పెట్టవని అంటున్నారు నిర్వహకులు. అందుకే పందులను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పందులతో సేద తీరినందుకు అరగండకు 2,200 అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1240 చెల్లిస్తున్నారు. మిపిగ్ కేఫ్ లో ఉన్న ప్రతి పంది ప్రత్యేకమైనదని ఆ కేఫ్ ఎగ్జిక్యూటీవ్ షిహూ కిటవాగా అంటున్నారు. ఇక్కడ పందులను ముద్దుగా బుటా – సాన్ గా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ పందులను విక్రయిస్తామని.. ఇప్పటి వరకు 1300 పందులను విక్రయించినట్లు షిహూ కిటవాగా తెలిపారు.

జపాన్ లోని టోక్యో లో 2019 లో తొలి పందుల కేఫ్ ను నెలకొల్పారు. తాజాగా హరాజుకు లో మిఫిగ్ కేఫ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడ పందులు మనుషులతో గడిపేందుకు బాగా ఇష్టపడుతుంటాయి. మిపిగ్ కేఫ్ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విదేశీయులు జపాన్ కి వచ్చినపుడు మిపిగ్ కేఫ్ ను చూసి వెళ్తున్నారు. సాధారణంగా జంతువులతో కొద్ది సమయం గడిపితే.. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, తలనొప్పి ఇతర టెన్షన్లు దూరమైతాయని కార్నెల్ యూనివర్సిటీ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ కోర్న్ రిచ్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి