iDreamPost

వాయిదా పడ్డ ఒలింపిక్స్

వాయిదా పడ్డ ఒలింపిక్స్

గత కొన్ని రోజులుగా ఒలింపిక్స్‌ క్రీడలు వాయిదా అంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలు నిజమయ్యాయి. ప్రపంచ క్రీడా సంగ్రామంలో అత్యున్నత పోటీలైన ఒలింపిక్స్‌ క్రీడలు వాయిదా పడ్డాయి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఊహించనంత వేగంగా ప్రబలుతుడటంతో ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలిపింక్స్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఐఓసీ ప్రకటించింది.కరోనా ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరిపామని,కానీ ప్రపంచం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో వాయిదా వెయ్యటం తప్ప మరో మార్గం లేక పోయిందని అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడు డిచ్ పౌండ్ తెలిపారు. ఈ నిర్ణయం అత్యంత బాధాకరమైనదని ఐఓసీ స‌భ్యుడు పౌండ్ పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారమైతే జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్‌ జరగాల్సి ఉంది.కానీ కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 192 దేశాలకు వ్యాపించింది.దీంతో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ప్రకటించాయి.కరోనా ఎఫెక్ట్‌తో పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి.ఈ విపత్కర పరిస్థితులలో ఒలంపిక్స్ నిర్వహణ సాధ్యపడదని ఐఓసీ భావించింది.

ఇప్పటికే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు రద్దయ్యాయి.కరోనా ప్రభావంతో అథ్లెట్ల ట్రైనింగ్ కూడా సాగట్లేదు.రెండు రోజుల క్రితం కెన‌డా,ఆస్ట్రేలియా దేశాలు క్రీడాకారుల శ్రేయస్సు దృష్ట్యా ఒలంపిక్స్ నుండి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.ఒలంపిక్స్ టోర్నీ వాయిదాపై జ‌పాన్ ప్ర‌భుత్వంతో ఐఓసీ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్ర‌క‌ట‌న చేసింది.ప్రపంచ మహా సంగ్రామ క్రీడల పోటీలను మ‌ళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయంపై స్ప‌ష్ట‌త ఇవ్వలేదు.కానీ 2021కి ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది.ఒకవేళ ఒలింపిక్స్‌ రద్దయితే రూ. 21,500 కోట్ల స్వదేశీ స్పాన్సర్‌షిప్‌,నిర్వహణ ఏర్పాట్ల కోసం ఖర్చుపెట్టిన రూ.90 వేల కోట్లు జపాన్‌ నష్టపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి