iDreamPost

Janhvi Kapoor: ‘దేవర’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్లతో ఎప్పటికీ డేటింగ్ చేయనంటూ..!

  • Published Jan 06, 2024 | 9:06 PMUpdated Jan 06, 2024 | 9:06 PM

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ‘దేవర’ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే డేటింగ్​పై జాన్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ‘దేవర’ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే డేటింగ్​పై జాన్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jan 06, 2024 | 9:06 PMUpdated Jan 06, 2024 | 9:06 PM
Janhvi Kapoor: ‘దేవర’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్లతో ఎప్పటికీ డేటింగ్ చేయనంటూ..!

వారసత్వాన్ని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది మరీ కష్టం. వారసత్వం ద్వారా సులువుగా ఆడియెన్స్​లో ఎక్స్​పోజర్ దొరుకుతుంది. వద్దన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఆ తర్వాత టాలెంట్​ ఉంటేనే కంటిన్యూ అవ్వగలరు. గ్లామర్ కంటే కూడా ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగగలరు. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతో మంది వారసులు తమపై అభిమానులు పెంచుకున్న అంచనాలను అందుకోవడం వల్లే ఈ రేంజ్​కు చేరుకున్నారు. ఈ కోవలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఒకరు జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన జాన్వీ తక్కువ టైమ్​లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో ‘దేవర’ చిత్రంలో నటించే అవకాశాన్నీ దక్కించుకున్నారు. అయితే తాజాగా డేటింట్​పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాంటి వారితో తాను డేటింగ్ చేయనన్నారు జాన్వీ.

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్​ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో తాజాగా పాల్గొన్నారు జాన్వీ కపూర్. చెల్లి ఖుషి కపూర్​తో కలసి ఈ ప్రోగ్రామ్​లో ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంతో పాటు మూవీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే డేటింగ్, లవ్ లైఫ్ మీదా రియాక్ట్ అయ్యారు. మీకు ఎప్పుడైనా రొమాంటిక్ మెసేజెస్ వచ్చాయా? అని జాన్వీని కరణ్ క్వశ్చన్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఈ ప్రశ్నకు జవాబు చెబితే ఖుషీ తనను ఏడిపిస్తుందని ఫన్నీగా చెప్పారు. ఎవరితో డేటింగ్ చేస్తారనే క్వశ్చన్​కు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో మాత్రం అస్సలు చేయనన్నారు. సినిమా వాళ్లతో డేటింగ్ చేయనని.. డేటింగ్ చేసేవాళ్లకు తానే ప్రపంచమై ఉండాలన్నారు జాన్వీ. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసే వారై ఉండాలన్నారు. మూవీ ఇండస్ట్రీలో ఎంతో ఒత్తిడి ఉంటుందని.. ఒకే ప్రొఫెషన్​లో ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమన్నారు జాన్వీ.

‘కాఫీ విత్ కరణ్​’ షోలో ‘దేవర’ సినిమా గురించీ ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ చిత్రం సెట్స్​లో జరిగిన ఓ విషయాన్ని అందరితో పంచుకున్నారు. తనకు తెలుగు చదవడంతో పాటు మాట్లాడటం కూడా రాదన్నారు. అయితే సెట్​లో డైలాగ్ పేపర్ ఇస్తే మాత్రం టకటకా చెప్పేదాన్నని జాన్వీ పేర్కొన్నారు. ఇక, ‘ధడక్​’తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. ‘బవాల్’, ‘గుడ్​లక్ జెర్రీ’, ‘గుంజన్ సక్సేనా’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆయా మూవీస్​లో గ్లామర్​తో పాటు ఆమె యాక్టింగ్​కూ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ‘దేవర’ షూటింగ్​తో ఆమె చాలా బిజీగా ఉన్నారు. ఇందులో ‘తంగం’ అనే పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లడ్ బాత్ పేరిట విడుదలైన ఈ వీడియోలో తారక్ తన ఆయుధాన్ని పారే నీటిలో కడుగుతూ కనిపించారు. మరి.. సినిమా వాళ్లతో అస్సలు డేటింగ్ చేయనంటూ జాన్వీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Actor Sunil:అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన నటుడు సునీల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి