iDreamPost

నా తండ్రి కబ్జా చేశాడు.. క్షమించండి.. ఎమ్మెల్యే కూతురు!

నా తండ్రి కబ్జా చేశాడు.. క్షమించండి.. ఎమ్మెల్యే కూతురు!

సాధారణంగా ఎవరైన ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే.. కుటుంబమంతా అతడికి తోడుగా ఉంటారు. ముఖ్యంగా కట్టుకన్న భార్యా, కన్న బిడ్డలు..రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి తోడు నీడగా ఉంటారు. రాజకీయంగా ఉన్నత స్థితికి వెళ్లేందుకు కొడుకు, కూతుర్లు ఎంతో కృషి చేస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే కుమార్తె మాత్రం.. ఆయనకు కంటిలో నలుసులాగా మారింది. ప్రత్యర్థుల మాయలో పడి తన బిడ్డ అలా ప్రవర్తిస్తుందని.. సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యే ఎవరు.. ఆయన కుమార్తె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్టం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యేకు .. ఆయన కుమార్తె ప్రత్యర్థిగా మారి.. తన రాజకీయ భవిష్యతుపై తీవ్ర ప్రభావం చూపించేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తండ్రిపై భవానీ కొంతకాలంగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. గతంలో చేర్యాల, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఆయన కుమార్తె ఫిర్యాదు కూడా చేశారు.

తాజాగా చేర్యాలకు వెళ్లి.. తన పేరిట ఉన్న భూమిని .. ఆ మున్సిపల్ కి రాసిస్తున్నట్లు ప్రకటించి ఆమె అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాక తన పేరిట ఉన్న భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. ఆమె మాట్లాడుతూ..” నాన్న తప్పు చేశారు. నా పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని కోర్టు ద్వారా చేర్యాల గ్రామానికే అప్పగిస్తాను. అక్రమంగా వచ్చిన ఆస్తులు, సొమ్ము నాకు వద్దు. 70 ఏళ్లు వచ్చి.. చేయాల్సిన పని ఇది కాదు. ఎమ్మెల్యే కాకముందే మా నాన్నకు రూ.1000 కోట్ల ఆస్తి ఉంది. నెలకు రూ.1.5 కోట్లు కిరాయి వస్తాయి. అటువంటి మనిషి ఇలాంటి భూమి తీసుకోకుండదు” అంటూ భవావి ప్రకటించారు.

ఆదివారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, అఖిల పక్షం నాయకులతో కలిసి సిద్ధిపేటజిల్లాల చేర్యాల పెద్ద చెరువు మత్తడి కింద ఆమె పేరిట ఉన్న భూమి వద్దకు వచ్చారు. అక్కడి ప్రహారిని కూల్చి వేశారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందిస్తూ.. కొందరు స్వార్థపరులు తన కూతుర్ని రోడ్డు కీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. చేర్యాల మున్సిపాలిటీకి భూమిని ఇస్తున్నట్లు తుల్జా భవాని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాను. ఆ స్థలం ప్రభుత్వానిది కాదు. పట్టాభూమి. కొందరు స్వార్థ పరులు నా బిడ్డను రోడ్డుకీడ్చారు. వారెవరో సీఎంకు తెలుసు. నేను ప్రజాక్షేత్రంలో ఉండటం ఖాయం” అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి అన్నారు. మరి.. ఈ ఇష్యూపై మీ ఆభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి