iDreamPost

జైలర్ సీక్వెల్ కోసం సూపర్ స్టార్ తో దళపతి..?

  • Author ajaykrishna Updated - 03:26 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:26 PM, Thu - 17 August 23
జైలర్ సీక్వెల్ కోసం సూపర్ స్టార్ తో దళపతి..?

సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నాడు. రజినీ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘జైలర్’. ఇటీవల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విడుదలైన నాలుగో రోజే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసిన జైలర్.. ప్రస్తుతం అత్యధిక లాభాల బాటలో పరుగులు పెడుతోంది. విడుదలైన వారం రోజుల్లోనే జైలర్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ. 450 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇంకా ఫుల్ రన్ లో కోలీవుడ్ బిగ్గెస్ట్ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రజినీ చాలా కాలం తర్వాత ఓ మాస్ యాక్షన్ తో పాటు సీరియస్ కామెడీ చూపించేసరికి.. నెల్సన్ స్క్రీన్ ప్లేకి బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు. ఈ సినిమా కూడా నెల్సన్ గత సినిమాలు.. డాక్టర్, బీస్ట్ మాదిరిగా డార్క్ కామెడీతో సాగింది. అందులోనూ అనిరుధ్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని కలిపి జైలర్ ని బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. టెక్నికల్ పాయింట్స్ ఓవైపు అయితే.. జైలర్ లో స్టార్ హీరోలు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల మాసీవ్ గెస్ట్ అప్పియరెన్స్ ఒక ఎత్తు. అసలు సినిమాలో వీరి ఎంట్రీకి థియేటర్స్ అన్ని షేక్ అయిపోతున్నాయి. అయితే.. ప్రస్తుతం జైలర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది టీమ్.

ఇదిలా ఉండగా.. జైలర్ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ.. తన వద్ద జైలర్ కి సీక్వెల్ స్టోరీ లైన్ రెడీగా ఉందని చెప్పాడు. దీంతో ఇప్పుడు తమిళ, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న జైలర్ కి.. సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి సీక్వెల్ లో సూపర్ స్టార్ రజినీతో పాటు దళపతి విజయ్ కూడా యాడ్ కాబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. నెల్సన్ స్టోరీని పకడ్బంధీగా సిద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నాడని కోలీవుడ్ కోడైకూస్తోంది. ఇక జైలర్ తర్వాత రజినీ.. జైభీమ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు. మరోవైపు విజయ్.. లియో తర్వాత వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. మరి జైలర్ కి సీక్వెల్ చేస్తే బాగుంటుందా లేదా కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి