iDreamPost

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ అన్న మాటలు మర్చిపోలేను: జగపతి బాబు

  • Author Soma Sekhar Published - 03:13 PM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 03:13 PM, Tue - 19 September 23
డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ అన్న మాటలు మర్చిపోలేను: జగపతి బాబు

జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో స్టైలిష్ విలన్ గా ఓ రేంజ్ విలనిజాన్ని పండిస్తున్నారు. విలన్ గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భాషతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ.. ఫుల్ బిజీగా మారారు జగపతి బాబు. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి జోరుమీదున్న జగ్గూభాయ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ పై ప్రశంసలు కురిపించాడు. తాను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ చెప్పిన మాటలు మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు జగపతి బాబు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు జగ్గూభాయ్. ఈ ఇంటర్వ్యూలో తన సినీ జీవిత విశేషాలతో పాటుగా నిజ జీవితంలో జరిగిన సంఘటనల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు జగ్గూభాయ్.

జగపతి బాబు మాట్లాడుతూ..”ఎంత సాధించినా.. ఎన్ని అవార్డులు వచ్చినా.. రాజమౌళి కుటుంబంలో గర్వం కనిపించదు. వారి ఫ్యామిలీలో అందరూ అలాగే ఉంటారు. వీరు ఎక్కడికైనా హాలీడే ట్రిప్ కు వెళ్లినా.. అక్కడ కూడా సినిమాల గురించే మాట్లాడుకుంటారు. రాజమౌళి ఫ్యామిలీ సినిమాను ఓ తపస్సులా చూస్తారు. అందుకే అన్ని హిట్లు వస్తున్నాయి. వీరి కుటుంబం నుంచి మనం 20 శాతం నేర్చుకున్నా చాలు” అంటూ చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ..” ప్రభాస్ ది ఎంతో గొప్ప మనసు. అతడికి ఇవ్వడం తప్పితే.. తీసుకోవడం తెలీదు. ఎవరేం సాయం కావాలన్నా చేస్తాడు. నేను ఒకసారి మానసికంగా కుంగిపోయి.. డిప్రెషన్ లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్ కు ఫోన్ చేసి మాట్లాడాలి అని అడిగా. అప్పుడు డార్లింగ్ జార్జియాలో ఉన్నాడు. డార్లింగ్ నేనున్నాను, నీ సమస్యేంటో చెప్పు నేను తీరుస్తా అంటూ ధైర్యం చెప్పాడు. అన్నట్లుగానే జార్జీయా నుంచి తిరిగి రాగానే నన్ను కలిశాడు. ఆ సమయంలో ప్రభాస్ ఓదార్పు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది” అంటూ ప్రభాస్ గొప్పతనం వివరించాడు. వయసులో చిన్నవాడైనా.. గొప్ప మనసు ప్రభాస్ ది, అందరిని ప్రేమగా చూస్తాడని జగ్గూభాయ్ తెలిపాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి