iDreamPost

మరో చరిత్రకు శ్రీకారం.. నేడు జగనన్న వసతి దీవెన ప్రారంభం

మరో చరిత్రకు శ్రీకారం.. నేడు జగనన్న వసతి దీవెన ప్రారంభం

తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిలుస్తున్నారు. ప్రజా సంక్షేమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళుతూ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి ఫీజు రియంబర్స్‌మంట్‌ పథకం ప్రవేశపెట్టారు. దేశంలోనే ఈ తరహా పథకం అమలు చేసిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది.

ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఉన్నత చదువులకేగాక ఒకటో తర గతి నుంచి ఇంటర్‌ వరకు పిల్లల చదువులకు ఆర్థిక చేయూతనిస్తూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. తాజాగా తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకానికి కొనసాగింపుగా జగనన్న వసతి దీవెన పథకం నేడు సోమవారం విజయనగరం నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పథకం కింద ఫీజు రియంబర్స్‌మెంట్‌తో విద్యనభ్యసిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి వసతి, భోజన ఖర్చుల కోసం ప్రభుత్వం నగదు ఇస్తుంది.

జగన్న వసతి దీవెన పథకం కింద ఇచ్చే నగదు కూడా విద్యార్థుల తల్లుల ఖాతాకు జమచేయనుంది. ఐటీఐ చదివే విద్యార్థికి ఏడాదికి 10 వేల రూపాయలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ ఆపై చదివే వారికి ఏడాదికి 20 వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మొత్తాలను రెండు దఫాల్లో ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో ఈ పథకం కింద నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 11. 61 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2300 కోట్ల రూపాయలు వెచ్చించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి