iDreamPost

కలాం స్ఫూర్తితో.. కలలను సాకారం చేస్తున్న జగన్‌

కలాం  స్ఫూర్తితో.. కలలను సాకారం చేస్తున్న జగన్‌

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మిసైల్‌ మ్యాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యార్థులకు, యువతకు స్పూర్తినిచ్చారు. ఆ మాట విద్యార్థులకే కాదు.. ప్రతి ఒక్కరికీ అన్వయించుకోవచ్చు. ఒక వ్యక్తి తన లక్ష్యం కోసం ఒక కలను కని, దాన్ని నెరవేర్చుకుంటే.. ఆ కుటుంబం బాగుంటుంది. అదే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధాని ఒక కలను కని, దాన్ని నెరవేరిస్తే ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది. వారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారు. అయితే ఇలా రాష్ట్ర, దేశ భవిష్యత్‌ కోసం కలలు కనే రాజకీయ నాయకులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతుడిగా కనపడుతున్నారు.

విజయనగరంలో దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించిన తీరు ఎంతో ఆలోచనాత్మకంగా, ఉన్నతంగా ఉంది. ఆయన ఆలోచనలను మనం ఊహించుకుంటే.. ‘అవును.. ఎంత బాగుందో కదా ఆయన కల’ అంటూ అనుకుంటాం. అంతలోనే ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాల్చుతూ మన ముందే కనపడుతున్న కార్యక్రమాలు ఆయనపై గౌరవాన్ని పెంచుతాయి.

 ‘‘గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు వీలుగా గ్రామ సచివాలయం, ఆ పక్కనే విద్యార్థుల పునాదులను బలంగా తీర్చిదిద్దేలా ఓ ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాల, రోగులకు వైద్యం అందించేందుకు ఓ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడంతోపాటు విత్తనాలు, ఎరువులు అందించేందుకు ఓ రైతు భరోసా కేంద్రం, మహిళలు రక్షణగా మహిళా పోలీస్‌ మిత్రాలు, నాణ్యమైన కరెంట్‌’’ ఇవన్నీ ఉన్న గ్రామాలు సంతోషంగా ఉండక ఏం చేస్తాయి. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎన్నో ఏళ్లుగా ఒక కలగానే మిగిలిపోయింది. ఏపీలో మాత్రం దాన్ని సాకారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు వైఎస్‌ జగన్‌. ఒక పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని దాన్ని అమలు చేస్తున్నారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ నెరవేర్చారు. ఇదే పనితీరును రానున్న నాలుగేళ్లు కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి