iDreamPost

కేసీఆర్ పేరుతో సినిమా.. హీరోగా స్టార్ కమెడియన్!

  • Published Oct 14, 2023 | 10:57 AMUpdated Oct 14, 2023 | 10:57 AM
  • Published Oct 14, 2023 | 10:57 AMUpdated Oct 14, 2023 | 10:57 AM
కేసీఆర్ పేరుతో సినిమా.. హీరోగా స్టార్ కమెడియన్!

తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చాయి.. అందులో జబర్ధస్త్ కామెడీ షో బాగా పాపులర్ అయ్యింది. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  జబర్ధస్త్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటులు ఇప్పుడు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ లో చిన్న కంటెస్టెంట్ గా అడుగు పెట్టి తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌లు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకును కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ రాకింగ్ రాకేష్‌. టీమ్ లీడర్ గా చిన్న పిల్లలతో స్కిట్స్ చేయిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై బిజీగా ఉన్నాడు రాకింగ్ రాకేష్. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడం కోసం కోట్ల మందిలో స్పూర్తి నింపిన ఉద్యమ నేత కేసీఆర్ పేరు కి ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా కేసీఆర్ పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జబర్ధస్త్ లో తమదైన కామెడీతో క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ, రష్మి, కమెడియన్లు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, గెటప్ శ్రీను ఇలా ఎంతోమంది వెండితెరపై వెలిగిపోతున్నారు. జబర్ధస్త్ తో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నవారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. మామూలు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రాకేష్ అంచెలంచెలుగా ఎదిగి టీమ్ లీడర్ అయ్యాడు. వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. తాజాగా రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో కేసీఆర్ (కేశవ్ చంద్ర రవావత్) అనే టైటిల్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా లాంచ్ చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో దాదాపు 50వేల మంది విద్యార్థుల సమక్షంలో టైటిల్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రతో తెరకెక్కిస్తున్న ‘కేసీఆర్’ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆయన ఫేస్ రివీల్ చేయలేదు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై అంజి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. గతంలో అజి గరుడవేగ లాంటి చిత్రాలకు డీవోపీగా పనిచేశారు. ఈ మూవలో అనన్య హీరోయిన్ గా నటిస్తుంది. ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, ధన్ రాజ్, జోర్దార్ సుజాత, రచ్చరవి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ మూవీ పొలిటికల్ డ్రామానా లేదా హైప్ కోసం కేసీఆర్ టైటిల్ పెట్టారా అన్న విషయం తెలియరాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి