iDreamPost

విశాఖనే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ?

విశాఖనే  అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ?

శీతాకాల సమావేశాల ముగింపు రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ రాజధానిపై చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. దక్షిణాఫ్రికా మాదిరి మనకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని, మనము మారాలని, అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా , కర్నూల్ జ్యుడిషియల్ రాజధానిగా, విశాఖ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉండచ్చేమో, కమిటి రిపోర్టు రాగానే పూర్తి వివరాలు ప్రకటిస్తాం అని చెబుతూ, ప్రస్తుతం ఉన్న అమరావతికి 8 వేల చదరపు అడుగుల రాజధాని ఎందుకు? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి రాజధానులు వేయి చదరపు అడుగుల లోపు ఉన్నాయని, డబ్బంతా రాజధాని అంటూ ఖర్చు చేస్తే పోలవరం బనక చర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి 53వేల కోట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇంకా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉందని, రాజధాని పేరు చెప్పుకుంటు వాటిని విమర్శిస్తే చరిత్ర క్షమించదని చెప్పుకొచ్చారు.

అయితే కమిటి రిపొర్టు వచ్చిన తరువాత ఖచ్చితంగా అందులో విశాఖనే అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉండాలని సూచించే అవకాశాలు మెండుగ ఉండటంతో,అత్యంత గోప్యంగా విశాఖ కేంద్రంగా అడ్మినిస్ట్రేటివ్ రాజధాని పనులు ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కొరకు విశాఖ పరిసర ప్రాంతాల్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే బడా పారిశ్రామిక వేత్తకు చెందిన సుమారు రెండున్నర లక్షల చదరపు అడుగుల భవనాలను పరిపాలన భవనాలుగా వాడుకోవటానికి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ లో ఖాలీగా ఉన్న భవనాలను కూడా పాలన కోసం ఉపయోగించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. భీమిలీ దగ్గర మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలవంతమైన ఒక భవనాన్ని ముఖ్యమంత్రి నివాసం కొరకు ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం కొరకు భోగాపురం అందుబాటులోనే ఉంది కనుక , కొత్త గా రాబొయే భవనాలు పరదేశిపాలెం కేంద్రంగా ప్రారంభం అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గవర్నర్ నివాసం కొరకు విశాఖలో అనువైన ప్రదేశం కొరకు చూస్తునట్టు తెలుస్తుంది. రాబోయే మూడు నెలల్లో పరిపాలన భవనాలు అన్నీ పూర్తిగా విశాఖకు తరలించి ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తుంది.

ఈ వ్యవహారాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతూ చక్కపెట్టటానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టిలో అత్యంత ముఖ్యులైన ఒక నలుగురికి ఈ బాధ్యతలను అప్పజెప్పినట్టు తెలుస్తుంది.

ఒక పక్క రాజధాని నిర్ణయం పై అమరావతి పరిసర ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న విశాఖ, కర్నూల్ ప్రాంతాలలో ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ జరిగితేనే రాబోయే రోజుల్లో ప్రాంతీయ అసమానతలు రాకుండా ఉంటాయని రాష్ట్రంలో మెజారిటి సభ్యుల అభిప్రాయంగా తెలుస్తుంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్న ప్రభుత్వం నియమించిన బి.యన్ రావు కమిటి ఇచ్చే నివేదికలో ఎలాంటి సూచనలు ఉండబోతున్నాయనే అంశం మీద జోరుగా చర్చ జరుగుతుంది. నేడు రాబోయే ఆ రిపోర్టుతో రాజధాని భవిష్యత్తు తేలిపొతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి