iDreamPost

50 రోజుల ఓటిటి – సాధ్యాసాధ్యాలు

50 రోజుల ఓటిటి – సాధ్యాసాధ్యాలు

ఇకపై థియేటర్ కు ఓటిటికి మధ్య ఖచ్చితంగా 50 రోజుల నిబంధన ఉండాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో చెప్పలేదు కానీ త్వరలోనే అవీ బయటికి వస్తాయి. వినడానికి ఇది బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందనే దాని గురించి పలు అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఫ్లాప్ అయిన వాటికి ఎంత గ్యాప్ ఇచ్చినా ఒకటే.రిలీజైన మొదటి రోజే బ్యాడ్ టాక్ వచ్చినప్పుడు ఓటిటిలో లేట్ గా వస్తుందని తెలిసినా సరే డిజాస్టర్లను చూసేందుకు జనం థియేటర్లకు వెళ్ళరు. ఆచార్య, రాధే శ్యామ్, ఖిలాడీలు దానికి మంచి ఉదాహరణ.

ఈ పద్ధతి కేవలం హిట్ చిత్రాలకు మాత్రమే పనికొస్తుంది. చాలా బాగుందని తెలిసినప్పుడు ప్రేక్షకుడు హాల్లో చూసేందుకు ఇష్టపడతాడు. ఆర్ఆర్ఆర్ లాంటి స్ట్రెయిట్ సినిమాలు, కెజిఎఫ్, విక్రమ్ లాంటి డబ్బింగ్ మూవీస్ బాగా ఆడేందుకు కారణం ఇదే. అంతే తప్ప కేవలం డిజిటల్ ప్రీమియర్లను లేట్ చేయడం వల్ల కలెక్షన్లు పెరగవు. దానికి తోడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఓటిటిలు కూడా పీఠముడి వేస్తాయి. దాదాపు రెండు నెలలు గ్యాప్ అంటే తక్కువ మొత్తమే ఇస్తామని బేరాలాడతాయి. అప్పుడు నిర్మాత కోట్లలో నష్టపోతాడు. అసలు సినిమా లైఫే రెండు వారాలకు మించని ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా 50 రోజుల జీవితాన్ని ఆశించడం అత్యాశే అనిపిస్తుంది

ఏది ఏమైనా థియేటర్ జనాలు మారిపోయారు. ముఖ్యంగా కరోనా తర్వాత వాళ్ళ ఆలోచన ధోరణిలో ఎన్నో మార్పులొచ్చాయి. దానికి తోడు ప్రభుత్వాలు అవకాశం ఇచ్చాయి కదాని టికెట్ రేట్లను బడ్జెట్ తో సంబంధం లేకుండా కేవలం క్రేజ్ ఆధారంగా పెంచుకుంటూ పోవడం తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ముందు చర్య తీసుకోవాల్సింది ఇలాంటి పరిణామాల మీద. అంతే తప్ప ఓటిటిలను కట్టడి చేయడం ద్వారా దక్కే ఫలితాలు డౌటే. నిర్మాతల మీటింగ్లో ఇంకా ఇతర అంశాలు కూడా చర్చించారు కానీ ఒక్కొక్కటిగా అమలు కాబోతున్నాయి. నిజంగానే ఇది జరిగితే అప్పుడు డిజిటల్ సంస్థలు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది.చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి