iDreamPost

Beer హెల్త్ దెబ్బ‌తిన‌కుండా మీరు రోజూ ఎంత బీర్ తాగవచ్చు?

Beer హెల్త్ దెబ్బ‌తిన‌కుండా మీరు రోజూ ఎంత బీర్ తాగవచ్చు?

ఆల్క‌హాల్ అంటే డేంజ‌ర్ అంటాం, అదే బీర్ అంటా… ఓకే అనేస్తాం. ప్రచంపంలో ఆల్క‌హాల్ ర‌కాల్లో బీర్ య‌మపాపుల‌ర్. అంత‌లా అంటారా? టీ, వాట‌ర్ త‌ర్వాత జనం ఎక్కువ తాగేదే బీరే. 2020లోనే, ప్రపంచ బీర్ వినియోగం 177.50 మిలియన్ కిలోలీటర్లు. అంటే సుమారు 280.4 బిలియన్ సీసాలు. అంటే గండిపేట చెరువుకన్నా ఎక్కువ బీర్. ఇంకో సంగ‌తి మొద‌ట కనిపెట్టిన మ‌త్తుపానీయం.. బీర్. ఆల్క్ హాల్ క‌న్నా బీర్ ను తాగితే మీ కాలేయాన్ని మ‌ర ఇబ్బంది పెట్ట‌కుండా మీరు ఎంజాయ్ చేయొచ్చు.

ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు ఫార‌న్ బీర్లు మాత్ర‌మే మ‌న‌కు దొరికేవి. ఇప్పుడు దేశీయ బీర్లు వ‌చ్చేశాయి. కిక్ ఇస్తున్నాయి. భారతీయ బీర్ త‌యారీ మార్కెట్ 2014-2015లో వృద్ధి చూసింది. 2022లో విజృంభించేస్తోంది. బీరా 91(Bira 91 ), సింబా(Simba ) వంటివి కింగ్‌ఫిషర్ లాగే దేశ‌మంత‌టా క‌నిపిస్తున్నాయి. ఇక( Kati Patang) కాటి పతాంగ్, వైట్ ఔల్ (White Owl ) , క‌ల్ట్ కంపెనీల‌తోపాటు చాలా వేగంగా ఎదిగిన MAKA di, Briggs Breweryలు కొత్త రుచుల‌ను ఇస్తున్నాయి.

హెల్త్ దెబ్బ‌తిన‌కుండా రోజూ ఎంత బీర్ తాగవచ్చు?
బీర్ మ‌రీ బ్రాందీ, విస్కీ, ఓడ్కాలాంటి చెడ్డ‌దికాదు. ఇతర ఆల్కహాలిక్ పానీయాల కంటే ఎక్కువ పోషకాలున్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఐరన్, ఫాస్ఫేట్లు, ఫైబర్ కూడా ఉన్నాయి. త‌క్కువ మొత్తంలోనేలేండి. ఇంకో సంగ‌తి, డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొద్దిగా వైర్ తాగితే గుండుకు మంచిద‌ని అంటారుకాని, అదే బీర్ తాగితే గుండెకు ఇంకొంచెం మంచిదని, స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం కొంత‌వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని, ఇత‌ర‌త్రా గుండె జబ్బుల ప్రమాదాన్ని చిన్న స్థాయిలో తగ్గించవచ్చన్న‌ది అనేక వైద్య నివేదిక‌ల మాట‌. ఇది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో కూడా సాయ‌ప‌డుతుందంట‌. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఎక్కువ‌ సిలికాన్ కంటెంట్ వ‌ల్ల‌ ఎముకలు గ‌ట్టిప‌డ‌తాయి. ఆల్కహాత్ తీసుకొంటే మొద‌డు మొద్ద‌బారుతుంది, అదే బీర్ తాగితే జ్ఞాపకశక్తి స్వల్పంగా మెరుగుపరుస్తున్న‌ది వాస్తవం కూడా.

అలాగ‌ని పీపాలు పీపాలు తాగితే చాలా ప్ర‌మాదం. ఇంత‌కీ ఆరోగ్య‌క‌రంగా బీర్ తాగడానికి కొల‌త‌లు ఏమైనా ఉన్నాయా? రోజువారీ మోతాదు 300 – 450 ఎంఎల్ మించ‌కూడ‌దు. అంటే క్వాట‌ర్ బాటిల్ అంత తాగితే పెద్ద‌గా ప్ర‌మాదంలేదు. అయినా WHO మాట వింటే, బీర్ కాదుక‌దా, ఆల్క‌హాల్ ఉన్న ఏదీ తాగ‌కూడ‌దు.

ఏదైనా మితంగా తాగితే మీకు మంచిది. డోసు పెరిగిందా? శ‌రీరానికి కోలుకోలేని నష్టం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి