iDreamPost
android-app
ios-app

సమ్మర్ ఎఫెక్ట్: బీర్ల అమ్మకాల్లో తెలంగాణ ఆల్‌టైమ్ రికార్డు! అట్లుంటది మనోల్లతోని!

Beer Record Sales: ఎండలు దంచి కొడుతున్నాయి.. చాలా మంది మందుబాబులు హాయిగా చిల్ అవ్వడానికి బీర్లు లాగించేస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి.

Beer Record Sales: ఎండలు దంచి కొడుతున్నాయి.. చాలా మంది మందుబాబులు హాయిగా చిల్ అవ్వడానికి బీర్లు లాగించేస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి.

సమ్మర్ ఎఫెక్ట్: బీర్ల అమ్మకాల్లో  తెలంగాణ ఆల్‌టైమ్ రికార్డు! అట్లుంటది మనోల్లతోని!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. తెలంగాణ లో మార్చి నెల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. కొన్ని జాల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎండలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. వేగంగా వీస్తున్న వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లని పానియాల వెంట పడుతున్నారు. సమ్మర్ హాలిడేస్, పెండ్లిళ్ళ సీజన్ కావడంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రీల్ నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చినట్లు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎండల కారణంగా చల్ల చల్లగా బీర్లు లాగించేస్తున్నారు మందుబాబులు. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో  ఈ నెల 1 నుంచి 18 వరకు ఏకంగా రూ.670 కోట్ల విలువైన బీర్లు లాగించేశారు అంటే ఏ రేంజ్ లో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఈ ఒక్క నెలలోనే సుమారు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే తెలంగాణలో మందు బాబులు ఏరేంజ్ లో సత్తా చాటుతున్నారో అర్థమవుతుంది.  గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది ఎక్కువగా 28.7 శాతం బీర్లు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బీర్ల కొరత లేకుండా ఎక్సైజ్ అధికార్లు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో సెలవులు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల కారణంగా బీర్ల అమ్మకాలు మరింతపెరిగిపోయాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లిక్కర్ అమ్మకాలతో పోలిస్తే.. బీర్లు అమ్మకాలు అమాంతం పెరిగిపోయినట్లు అధికారుతు వెల్లడించారు. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. 1000 కి పైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హూటల్స్ ఉన్నాయి. ఇందులో మద్యం సరఫరా అందుబాటులో ఉంది. వీటి ద్వారా రోజుకు 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయం జరుగుతుంది. మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి తొలిస్థానం, వరంగల్ రెండో స్థానంలో నిలిచింది.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి