iDreamPost

ఎండలకు చిల్ అవుదామని బీర్ తాగుతున్నారా? డేంజర్ అంటున్ననిపుణులు!

చూస్తుండగానే సమ్మర్ సీజన్ వచ్చేసింది. అంతేకాక ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండల వేడికి జనాలు భయాందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిల్ అయ్యేందుకు బీర్లు తాగుతుంటారు. అయితే అవి తాగడం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

చూస్తుండగానే సమ్మర్ సీజన్ వచ్చేసింది. అంతేకాక ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండల వేడికి జనాలు భయాందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిల్ అయ్యేందుకు బీర్లు తాగుతుంటారు. అయితే అవి తాగడం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎండలకు చిల్ అవుదామని బీర్ తాగుతున్నారా? డేంజర్ అంటున్ననిపుణులు!

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మార్చి చివరి వారం వరకు ఓ మోస్తారుగా ఉన్న ఎండలు.. ఏప్రిల్ మొదటి వారంలో దంచికొడుతున్నాయి.  అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో జనాలు భయాందోళనకు గురవుతన్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎంతగా పెరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎండలను తట్టుకునేందుకు జనాలు డైట్ ఫాలో అవుతూ శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే మందుబాబులు బీర్ తాగుతూ చీల్ అవుతున్నారు. అయితే ఇలా కూల్ అయ్యేందుకు బీర్ ఎక్కువగా తాగితే  జరిగే నష్టం గురించి నిపుణులు వివరించారు.

చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్ అయ్యేందుకు వివిధ రకాల శీతల పానీయలను తీసుకుంటారు. అలానే మందు బాబులు సైతం సమ్మర్ వచ్చిందంటే.. మాములు రోజుల్లో కంటే ఎక్కువగా బీర్లను లాగిస్తుంటారు. చిల్ అవుద్దామని తెగ తాగేస్తుంటారు. చాలా మంది ఎండ వేడిని తట్టుకోలేక ఎక్కువగా బీర్లను సేవిస్తుంటారు. అయితే ఇలా వేసవిలో ఎక్కువగా మద్యం లేదా బీర్లను సేవించడం వల్ల అనేక  సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. ఎండల వేడిని తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లు తాగి చిల్ అవ్వాలని భావిస్తుంటారు. ఈక్రమంలో బీర్లను ఎక్కువగా లాగిస్తుంటారు. అలా బీర్లను తాగడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై.. చెమటగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

Are you drinking beer to cool off from the sun

అలానే చల్లదనం కోసం  వేసవిలో బీర్లు తాగడం వలన శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా శరీరంలో వేడి పెరగడం వలన వాంతులు విరేచనాలు, తలనొప్పి, మూర్చ వంటివి వచ్చే ప్రాణాలు రిస్క్ లో పడే అవకాశం ఉంది. వేసవి కాలం చాలా మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్  వాళ్ళతో బయటకు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు బీర్లు సేవిస్తూ సముద్రం, సరస్సులు, బీచ్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అలా ఎక్కువగా బీర్లను సేవించి మత్తులో తెలియకుండా నీటిలోకి వెళ్లి మునిగిపోయే అవకాశం ఉంది.

కాబట్టి సమ్మర్‌లో వైన్, బీర్లు కానీ తాగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అలానే కొందరు సమ్మర్ లో దూర ప్రయాణలు చేస్తున్న సమయంలో కూడా బీర్లు తాగు డ్రైవింగ్ చేస్తుంటారు. సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడపడమే ప్రమాదం.  అలా ప్రయాణ సమయంలో ఎక్కువ బీర్లను లాగించడం వల్ల శరీరానికి మత్తు ఎక్కుతుంది. ఈ క్రమంలో నిద్ర వచ్చినట్లు అయి కారు నడపలేక ఇబ్బందులు పడతారు. ఇప్పటికే ఎంతో మంది డ్రింక్ చేసి వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి వేసవి కాలం చిల్ అవుదామని బీర్లు తాగే వారు వాటికి కాస్తా దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి