iDreamPost

అయ్యర్‌ విషయంలో BCCI తప్పు చేసిందా? వరల్డ్‌ కప్‌ను మర్చిపోయారా?

  • Published Feb 29, 2024 | 12:43 PMUpdated Feb 29, 2024 | 12:52 PM

Shreyas Iyer: టీమిండియా యువ క్రికెటర్లకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. కాస్త స్టార్‌డమ్‌ వచ్చిన ప్లేయర్లను నెత్తిన పెట్టుకుని చూసుకునే బీసీసీఐ.. చెప్పిన మాట వినకుంటే.. తీసి నేలకు కొడతామని చాటిచెప్పింది. కానీ, అయ్యర్‌ విషయంలోనే కాస్త అన్యాయం జరిగినట్లు కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Shreyas Iyer: టీమిండియా యువ క్రికెటర్లకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. కాస్త స్టార్‌డమ్‌ వచ్చిన ప్లేయర్లను నెత్తిన పెట్టుకుని చూసుకునే బీసీసీఐ.. చెప్పిన మాట వినకుంటే.. తీసి నేలకు కొడతామని చాటిచెప్పింది. కానీ, అయ్యర్‌ విషయంలోనే కాస్త అన్యాయం జరిగినట్లు కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 29, 2024 | 12:43 PMUpdated Feb 29, 2024 | 12:52 PM
అయ్యర్‌ విషయంలో BCCI తప్పు చేసిందా? వరల్డ్‌ కప్‌ను మర్చిపోయారా?

భారత క్రికెట్‌ బోర్డు తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో చాలా మంది కొత్త వాళ్ల పేర్లు ఉన్నాయి. అలాగే కొంతమంది సీనియర్‌ క్రికెటర్లు పేర్లు మాయమయ్యాయి. కానీ, బాగా చర్చనీయాంశమైంది మాత్రం.. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ గురించే. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ తొలగించింది. బోర్డు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆదేశాలను పాటించకుండా.. దేశవాళి క్రికెట్‌కు దూరంగా ఉన్నందుకు వీరిద్దరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇషాన్‌ కిషన్‌పై చర్యలను చాలా మంది క్రికెట్‌ నిపుణులు సమర్ధిస్తున్నా.. శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో మాత్రం భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయ్యర్‌పై వేటు వేయడం సరైందే అని కొందరు, లేదు అతనికి బీసీసీఐ అన్యాయం చేసిందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ విషయంపై కాస్త లోతుగా వెళ్తే..

కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడి, కూసింత స్టార్‌డమ్‌, నేమ్‌, ఫేమ్‌ రాగానే కొంతమంది భారత ఆటగాళ్లు.. తామే జాతీయ జట్టును నడిపిస్తున్నట్లు ఫీలైపోతుంటారు. అలాంటి వాళ్ల జాబితాలో గతంలో చాలా మంది క్రికెటర్ల పేర్లు వినిపించాయి. హార్ధిక్‌ పాండ్యా కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఇషాన్‌ కిషన్‌ కూడా ఇదే కోవకు చెందిన వాడని తేలింది. కానీ, అయ్యర్‌ కూడా వీళ్ల బ్యాచ్చేనా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. కచ్చితంగా కాదు అని చెప్పలేం, అవును అని కూడా చెప్పలేం. ప్రస్తుతం క్రికెటర్ల చేతినిండా సంపాదన ఉంది. ఐపీఎల్‌ లాంటి రిచ్‌ క్యాష్‌ లీగుల కారణంగా.. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తోంది. కానీ, గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. దేశవాళి క్రికెట్‌ ఆడి, జాతీయ జట్టుకు ఆడితేనే సంపాదన. అయినా.. అప్పట్లో డబ్బు కంటే.. దేశానికి ఆడటమే గౌరవంగా భావించే వాళ్లు. ఇప్పుడు కూడా దేశానికి ఆడుతున్నాం అనే భావన ఉన్నా.. డబ్బు సంపాదన అనేది కూడా దానికి తోడైంది.

అందుకే కొంతమంది ఆటగాళ్లు.. దేశవాళి క్రికెట్‌లో జరిగే కొన్ని టోర్నీలకు దూరంగా ఉంటూ.. ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ గత నాలుగైదేళ్లుగా మరి ఎక్కువైంది. ఈ పరంపరకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగానే.. ఇషాన్‌, అయ్యర్‌లపై వేటు వేసింది బీసీసీఐ. మానసిక ఒత్తిడి అంటూ రెస్ట్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ డబ్బు తీసుకుని టీవీ షోస్‌లో పాల్గొనడంతో పాటు దేశవాళి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు, గాయమంటూ కుంటిసాకులు చెబుతూ.. అయ్యర్‌ ఐపీఎల్‌ 2024కు ప్రిపేర్‌ అవుతున్నాడు. అందుకే వీరిద్దరిపై బీసీసీఐ కన్నెర్రజేసింది. ఈ నిర్ణయంలో ఎలాంటి తప్పులేకపోయినా.. అయ్యర్‌ విషయంలో బీసీసీఐ కాస్త పెద్ద మనసు చేసుకోని ఉండాల్సిందని చాలా మంది అంటున్నారు.

శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆ రెండు టెస్టుల్లో విఫలం అవ్వడంతో చివరి మూడు టెస్టులకు అతన్ని పక్కపెట్టారు. దీంతో అతను ఐపీఎల్‌ ప్రిపరేషన్‌కి వెళ్లిపోయాడు. కానీ, బీసీసీఐ అతన్ని రంజీ ఆడమని కోరింది. తరచు గాయాలపాలయ్యే అయ్యర్‌.. రంజీ లాంటి టెస్ట్‌ ఫార్మాట్‌ టోర్నీ ఆడితే గాయపడే ప్రమాదం ఉందని గ్రహించి, ఒక వేళ దురదృష్టవశాత్తు గాయపడితే ఐపీఎల్‌తో పాటు రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు కూడా అందుబాటులో లేకుండా పోతానని ఆలోచించి.. రంజీకి దూరంగా ఉన్నాడు. పైగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అయ్యర్‌ ఎలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పాకిస్థాన్‌ 53, శ్రీలంకపై 83, సౌతాఫ్రికాపై 77, నెదర్లాండ్స్‌పై 128 పరుగులు చేసి అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 105 పరుగులు చేశాడు. మొత్తంగా 530 పరుగులతో టాప్‌ స్కోరర్స్‌ లిస్ట్‌లో నిలిచాడు.

మూడు నెలల క్రితం ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాడు, అందులోనా వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో సత్తా చాటిన ప్లేయర్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అయ్యర్‌ను సక్సెస్‌ ట్రాక్‌లో నడిపించాలి అనుకుని ఉంటే.. రాజ్‌కోట్‌ లాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై అతని ఇంకో అవకాశం కల్పించి ఉండాల్సింది. ఎలాగో టీమ్‌లో కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లాంటి సీనియర్లు లేరు కాబట్టి.. ఒక ఫామ్‌లో లేని ప్లేయర్‌కు అవకాశం ఇచ్చి.. అతను తిరిగి ఫామ్‌ అందుకునేందుకు బీసీసీఐ తన వంతు సాయం చేసి ఉండాల్సింది. కానీ, అలా చేయకుండా చివరి మూడు టెస్టులకు అతన్ని దూరం పెట్టారు. తర్వాత దేశవాళి క్రికెట్‌ ఆడలేదనే కారణంతో అతన్ని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించడం సరికాదని క్రికెట్‌ అభిమానులతో పాటు నిపుణులు అంటున్నారు. మరి అయ్యర్‌కు బీసీసీఐ అన్యాయం చేసిందా? అనే వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయంఇ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి