iDreamPost

హార్దిక్‌ పాండ్యాను ట్రోల్‌ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్‌! కరెక్టే అంటున్న ఫ్యాన్స్‌..

  • Published Aug 09, 2023 | 1:06 PMUpdated Aug 09, 2023 | 1:06 PM
  • Published Aug 09, 2023 | 1:06 PMUpdated Aug 09, 2023 | 1:06 PM
హార్దిక్‌ పాండ్యాను ట్రోల్‌ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్‌! కరెక్టే అంటున్న ఫ్యాన్స్‌..

టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శల జడివాన కురుస్తోంది. వెస్టిండీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో కెప్టెన్‌గా పాండ్యా పనికిరాడని మండిపడ్డ భారత క్రికెట్‌ అభిమానులు.. మూడో టీ20లో టీమిండియా గెలిచిన కూడా.. పాండ్యాపై విరుచుకుపడుతున్నారు. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ 49 పరుగుల వద్ద ఉన్న సమయంలో టీమిండియా విజయానికి రెండో పరుగులు అవసరమైన సమయంలో పాండ్యా సిక్స్‌తో మ్యాచ్‌ ముగించి, తిలక్‌ వర్మకు హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం లేకుండా చేశాడని క్రికెట్‌ అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడు ఏకంగా భారత మాజీ క్రికెటర్లు సైతం పాండ్యాపై సెటైర్లు కురిపిస్తున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విట్టర్‌ వేదికగా హార్దిప్‌ పాండ్యాపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. ‘కష్టమైన పని మీరు చేయండి, సులువైన పని నేను చేస్తా. ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది పాండ్యాకు సెటైర్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల టార్గెట్‌ ఛేజ్‌ చేస్తున్న క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించి.. టీమిండియాను విజయం వైపు నడిపించారు. సూర్య 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి.. విజయానికి మరో 39 పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు.

ఈ సమయంలో అంతా సంజు శాంసన్‌ బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. చేయాల్సిన పరుగుల తక్కవు, చాలా ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎలాగో సంజు ఫామ్‌లో లేడు.. కనీసం ఇప్పుడైనా ఒత్తిడి లేకుండా రన్స్‌ చేస్తే అతనిపై ఒత్తడి తగ్గుతుంది, ఫామ్‌లో వచ్చే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సంజు ప్లేస్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇక్కడే అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఇప్పుడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేయాల్సిన అవసరం ఏముందని, సంజును కాదని పాండ్యా బ్యాటింగ్‌కు రావాల్సిన పనేంటని అంతా అనుకున్నారు. టార్గెట్‌ ఈజీగా ఉందని, వచ్చి ఫినిష్‌ చేసి మార్కులు కొట్టేద్దామనే స్వార్థంతోనే పాండ్యా ముందుగా బ్యాటింగ్‌కు వచ్చినట్లు క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు.

రెండో టీ20లో సంజు తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇప్పుడు అతని కంటే ముందు రావడంలో స్వార్థం తప్ప మరొకటి లేదని, అందుకే ఇర్ఫాన్‌ పఠాన్‌.. కష్టమని పని వేరే వాళ్లకు ఇస్తూ.. సులువైన టార్గెట్‌ ఛేజ్‌లో పాండ్యా బ్యాటింగ్‌కు వస్తున్నాడనే అర్థంలో పఠాన్‌ ట్వీట్‌ చేసినట్లు అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటూ.. పఠాన్‌కే మద్దుతు తెలుపుతున్నారు. అలాగే బౌలింగ్‌ విషయంలో కూడా క్రికెట్‌ అభిమానులు పాండ్యాను తప్పుబడుతున్నారు. అర్షదీప్‌ సింగ్‌ లాంటి ఓ స్పెషలిస్ట్‌ బౌలర్‌ను జట్టులో ఉంచుకుని, ఆల్‌రౌండర్‌ అయిన పాండ్యా తొలి ఓవర్‌ వేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాపం.. గిల్‌! మొన్నటి వరకు నెక్ట్స్‌ కోహ్లీ అన్నారు.. కానీ, ఇప్పుడు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి