iDreamPost

MS Dhoni: ధోని విషయంలో ఆ భయమొద్దు ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ధోని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ధోని విషయంలో మీకు ఆ భయమెుద్దు అంటూ అభిమానులకు సూచించాడు.

ధోని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ధోని విషయంలో మీకు ఆ భయమెుద్దు అంటూ అభిమానులకు సూచించాడు.

MS Dhoni: ధోని విషయంలో ఆ భయమొద్దు ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో అత్యద్భుతమైన కెప్టెన్ గా మన్ననలు అందుకున్నాడు. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథిగా తనకంటూ ప్రత్యేక రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. అయితే క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే ధోని పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ధోని విషయంలో మీకు ఆ భయమెుద్దు అంటూ అభిమానులకు సూచించాడు.

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడికి సాయం చేసి రుణం తీర్చుకున్నాడు మిస్టర్ కూల్. అయితే ఈవెంట్స్ లో పాల్గొంటున్న ధోని లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. లాంగ్ హెయిర్ తో 40ల్లో కూడా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు. స్టార్ స్పోర్ట్స్ తో ధోని గురించి మాట్లాడుతూ..

“నేను ధోనిని ఒక నెల కింద కలిశాను. అప్పుడు అతడు లాంగ్ హెయిర్ తో పాత ధోనిని గుర్తుచేశాడు. ప్రస్తుతం అదే హెయిర్ స్టైల్ ను కొనసాగిస్తున్నాడు. ధోని 40 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా ఫిట్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఈ ఐపీఎల్ తో పాటుగా మరికొన్ని సంవత్సరాలు అతడు క్రికెట్ ఆడతాడు. ఆ విషయంలో ఫ్యాన్స్ కు భయమెుద్దు” అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం పఠాన్ వ్యాఖ్యలకు మద్ధతు పలుకుతున్నారు. నిజంగా ధోని కి 42 సంవత్సరాలు అంటే నమ్మలేకపోతున్నాం అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి పఠాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Anari (@cricketanari)

ఇదికూడా చదవండి: టీమిండియా ప్లేయర్లకు BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. వారికి నోటీసులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి