iDreamPost
android-app
ios-app

బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి? IRF లేఖ!

  • Published Feb 26, 2024 | 3:22 PMUpdated Feb 26, 2024 | 9:25 PM

ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలనేవి చోటు చేసుకుంటున్నాయి. వీటి వలన భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగుతుంది. అయితే ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఐఆర్ఎఫ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఓ కొత్త నిబంధనలు జారీ చేయాలని సూచించింది.

ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలనేవి చోటు చేసుకుంటున్నాయి. వీటి వలన భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగుతుంది. అయితే ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఐఆర్ఎఫ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఓ కొత్త నిబంధనలు జారీ చేయాలని సూచించింది.

  • Published Feb 26, 2024 | 3:22 PMUpdated Feb 26, 2024 | 9:25 PM
బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి? IRF లేఖ!

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికంటే మరణించే వారి సంఖ్య క్రమేపి పెరిగిపోతుంది. అయితే ఈ ప్రమాదాలకు గల కారణం అతి వేగంగా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం.  వీటి వల్లే రోడ్డు ప్రమాదాలు చోటు చేటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా.. బైకులు, కార్లు నడిపినవారు కూడా తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఎక్కువ శాతం ప్రాణ నష్టం జరుగుతుంది. వీటితో పాటు ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సులతో సహా భారీ వాహనాలన్నీ ఏదో రకంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఐఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ కొత్త నిబంధనలు జారీ చేయాలని సూచించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలనేవి చోటు చేసుకోవడవడం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడం వంటి ఘటనలు చూస్తేనే ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రమాదాలను నివారించేందుకు ఇక నుంచి బస్సులతో సహా అన్ని భారీ వాహనాల్లో సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంతర్జాతీయ రహదారి సమాఖ్య కోరింది. వీటి వలన రోడ్డు ప్రమాదాలను చాలా మేరకు తగ్గించడానికి వీలుంటుదని ఐఆర్ఎఫ్ పేర్కొంది. అందుకోసం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు ఐఆర్ఎఫ్ ఓ లేఖను కూడా రాసింది. అందులో బస్సు ప్రమాదాల వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక సీటు బెల్ట్ ఉంటే ఈ రోడ్డు ప్రమాదాల నుంచి చాలామంది ప్రజలు బయటపడవచ్చని, అందుకే ప్రతి బస్సుల్లోను సీట్ బెల్ట్ ఉండాలి. వాటిని కచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించాల్సిన అవసరం ఉందని ఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కపిల కోరారు.

ఇక నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 నివేదిక ప్రకారం.. అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా కేవలం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చైనాలోని 2022లో జరిగిన బస్సు ప్రమాదాల్లో 215 మంది మరణించారు. కాగా, ప్రజా రవాణా విషయంలో ఆ దేశాలు అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణమని కపిల తెలిపారు. అలాగే కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా అద్భుతమైన ఫలితాలను సాధించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇండియాలోని బస్సుల్లో ఈ తరహా జాగ్రత్తలను పాటించకపోవడంతోనే బడికి వెళ్లే పిల్లలు, అమాయకులు జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక పై బస్సులకు కూాడా సీటు బెల్ట్ తప్పనిసరి అంటు కోరుతున్న ఐఆర్ఎఫ్ నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి