iDreamPost

IPL Auction 2024: ఈసారి ఆక్షన్​లో మోస్ట్ అన్​లక్కీ క్రికెటర్ అతడే.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు!

  • Published Dec 20, 2023 | 3:58 PMUpdated Dec 20, 2023 | 3:58 PM

ఈసారి ఐపీఎల్​ ఆక్షన్​లో ఓ క్రికెటర్ మోస్ట్ అన్​లక్కీగా నిలిచాడు. అతడికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదనే చెప్పాలి. ఆ ప్లేయర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈసారి ఐపీఎల్​ ఆక్షన్​లో ఓ క్రికెటర్ మోస్ట్ అన్​లక్కీగా నిలిచాడు. అతడికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదనే చెప్పాలి. ఆ ప్లేయర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 20, 2023 | 3:58 PMUpdated Dec 20, 2023 | 3:58 PM
IPL Auction 2024: ఈసారి ఆక్షన్​లో మోస్ట్ అన్​లక్కీ క్రికెటర్ అతడే.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు!

ఐపీఎల్-2024 ఆక్షన్ ఇటు అభిమానులతో పాటు అటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపర్చింది. ఏయే ప్లేయర్ ఎంత ధరకు, ఏ టీమ్​కు పోతాడనేది చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఈసారి చాలా జట్లలో బౌలర్ల కొరత ఉంది. దీంతో బౌలర్లకు మంచి డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కొందరు పేసర్లను ఊహించని ధరకు దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. మిచెల్ స్టార్క్​ (రూ.24.75 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ.20.50 కోట్లు) ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని ధరకు అమ్ముడుపోయారు. పదహారేళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్​గా స్టార్క్ నయా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక, మంచి ధర పలికిన ఆటగాళ్లు సంతోషంలో ఉంటే.. ఎంతో ఎక్స్​పెక్టేషన్స్​తో వేలంలో నిలిచి అన్​సోల్డ్​గా నిలిచిన ప్లేయర్లు బాధలో మునిగిపోయారు. అందులో ఒకడు ఇంగ్లండ్ పించ్ హిట్టర్ ఫిల్ సాల్ట్. ఈసారి ఆక్షన్​లో మోస్ట్ అన్​లక్కీ క్రికెటర్​ అతడే అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్​లో ఉన్న సాల్ట్ వరుసగా ఫెంటాస్టిక్ నాక్స్ ఆడుతున్నాడు. వెస్టిండీస్​తో జరుగుతున్న సిరీస్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్​-2024 ఆక్షన్​కు ముందు విండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో 56 బంతుల్లోనే 109 రన్స్ చేశాడు సాల్ట్. అతడి ఇన్నింగ్స్​లో 4 బౌండరీలు ఉంటే ఏకంగా 9 సిక్సులు ఉన్నాయి. సరిగ్గా ఐపీఎల్ వేలం జరిగిన నెక్స్ట్ రోజు అంటే బుదవారం నాటి మ్యాచ్​లో మళ్లీ కరీబియన్ టీమ్ మీద మరో సెంచరీ బాదాడతను. ఈసారి 57 బంతుల్లోనే ఏకంగా 119 రన్స్ చేశాడు. ఇంతటి భీకర ఫామ్​లో ఉన్న సాల్ట్​కు క్యాష్ రిచ్ లీగ్​లోని ఏదో ఒక టీమ్ దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క జట్టు కూడా అతడ్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపలేదు.

భారీ ధరకు అమ్ముడుపోతాడని అనుకున్న సాల్ట్​ను ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడు అన్​సోల్డ్​గా మిగిలిపోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్​లు ఆడుతున్న సాల్ట్​ను ఎవరూ పట్టించుకోకపోవడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. అయితే చాలా టీమ్స్​లో మంచి ఓవర్సీస్ బ్యాటర్స్ ఉండటం, బౌలర్ల కొరత వల్ల వాళ్ల మీదే ఎక్కువ ఫోకస్ చేయడంతో సాల్ట్ లాంటి కొందరు స్టార్లు అన్​సోల్డ్​గా మిగిలిపోయారు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్​తో పాటు మరికొందరు ప్రముఖ క్రికెటర్లు వేలంలో అన్​సోల్డ్​గా ఉండిపోయారు. వాళ్లలో స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, కుషాల్ మెండిస్, కరుణ్​ నాయర్, జోష్ హేజల్​వుడ్, ఆదిల్ రషీద్, ఇష్ సోధి, సర్ఫరాజ్ ఖాన్, వాండర్ డస్సెన్, కొలిన్ మన్రో, జేమ్స్ నీషమ్ లాంటి వాళ్లు ఉన్నారు. మరి.. అన్​సోల్డ్ క్రికెటర్లలో సాల్ట్ కంటే అన్​లక్కీ ఇంకా ఎవరైనా ఉన్నారని భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MS Dhoni, Rishabh Pant: దుబాయ్​లో ధోని, పంత్ కొత్త అవతారం! వీడియో వైరల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి