iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: గ్రౌండ్ లో కోహ్లీ ఉగ్రరూపం.. ఇది అస్సలు గమనించి, ఊహించి ఉండరు!

  • Published Apr 16, 2024 | 2:42 PM Updated Updated Apr 16, 2024 | 2:42 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని, ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో తన ఉగ్రరూపాన్ని చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని, ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో తన ఉగ్రరూపాన్ని చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Virat Kohli: వీడియో: గ్రౌండ్ లో కోహ్లీ ఉగ్రరూపం.. ఇది అస్సలు గమనించి, ఊహించి ఉండరు!

IPL 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ వచ్చింది. తొలుత సన్ రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోతే.. ఆ తర్వాత ఇక మా వంతు అన్నట్లుగా చెలరేగిపోయారు ఆర్సీబీ ప్లేయర్లు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే కాక టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు నమోదు అయిన మ్యాచ్ గా రికార్డుల్లోకి ఎక్కింది. మ్యాచ్ గురించి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే బహుశా ఈ మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని, ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కోహ్లీని ఇంతకు ముందు ఇలా అస్సలు చూసుండరు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ కు దిగితే బౌలర్లకు చుక్కలు కనపడాల్సిందే. కర్మకాలి ఎవరైనా కవ్విస్తే.. తన బ్యాట్ తో సమాధానం గట్టిగా ఇస్తాడు. ఇక ఫీల్డింగ్ లో చిరుత వేగం విరాట్ సొంతం. అంతే కాదు.. చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. ఇదంతా ఒకవైపు అయితే తనలో ఉన్న డ్యాన్సర్ ను అభిమానులకు చూపుతూ ఉంటాడు. స్టెప్పులు వేస్తూ.. ఫ్యాన్స్ అరుపులకు రిప్లైలు ఇస్తుంటాడు. అయితే సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంతకు ముందెన్నడూ చూడని కోహ్లీని మీరు చూడొచ్చు. కోహ్లీ కెరీర్ లోనే ఇంత ఉగ్రరూపం దాల్చడం చూడలేదు. హైదరాబాద్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే.. ఆరెంజ్ ఆర్మీ కేకలతో ఆర్సీబీ హోం గ్రౌండ్ హోరెత్తిపోయింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తమలో తామే బాధపడిపోయారు.

కాగా.. మ్యాచ్ చూస్తున్న అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక గ్రౌండ్ లో ఫీల్డర్లు, బౌలర్ల సిచ్యూవేషం ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి? సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే.. విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనైయ్యాడు. తమ హోం గ్రౌండ్ లో ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తుంటే చూడలేకపోయాడు. గాల్లోకి పంచులు విసురుతూ, కోపంగా కాలితో తంతూ, బౌలర్లపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వికెట్ పడినప్పుడు మాత్రం చప్పట్లు కొడుతూ జట్టును ఉత్సాహపరిచాడు. ఇక ఈ వీడియోలో కోహ్లీని చూసిన ఫ్యాన్స్.. గ్రౌండ్ లో విరాట్ ను ఈ రేంజ్ ఉగ్రరూపంలో చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి సన్ రైజర్స్ మ్యాచ్ లో విరాట్ ఇచ్చిన రియాక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş