iDreamPost

చరిత్ర సష్టించిన SRH.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి..!

  • Published Apr 20, 2024 | 8:16 PMUpdated Apr 20, 2024 | 8:36 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఈ ఫీట్​ను నమోదు చేసిన టీమ్​గా ఆరెంజ్ ఆర్మీ నిలిచింది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు టీ20 క్రికెట్​లో హిస్టరీ క్రియేట్ చేసింది. పవర్​ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్​గా ఆరెంజ్ ఆర్మీ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో 6 ఓవర్లలో ఏకంగా 125 పరుగులు చేసింది ఎస్​ఆర్​హెచ్. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46) వల్లే ఈ ఘనత సాధ్యమైంది. వాళ్లిద్దరూ తొలి వికెట్​కు 131 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ తాండవం చేయడంతో డీసీ బౌలర్లు గుడ్లు తేలేశారు. కాగా, గతంలో పవర్​ప్లేలో అత్యధిక స్కోరు రికార్డు కేకేఆర్ పేరు మీద ఉండేది. 2017లో ఆ జట్టు ఆర్సీబీపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు సన్​రైజర్స్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ఇక, విధ్వంసక వీరులు హెడ్, అభిషేక్ ఔటైన తర్వాత ఎస్​ఆర్​హెచ్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ఎయిడెన్ మార్క్రమ్ (1) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (15)ను అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ స్పీడ్​కు బ్రేకులు పడ్డాయి. అయితే నితీష్​ కుమార్ రెడ్డి (9 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (11 నాటౌట్) ఇంకా క్రీజులోనే ఉన్నారు. వీళ్లిద్దరూ ఆఖరి వరకు ఆడితే టీమ్ స్కోరు ఈజీగా 250 దాటుతుంది. మరి.. ఎస్​ఆర్​హెచ్ చరిత్ర సృష్టించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి