iDreamPost

SRH vs CSK: హైదరాబాద్ vs చెన్నై.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Apr 04, 2024 | 4:39 PMUpdated Apr 04, 2024 | 4:48 PM

ఓటములతో కసి మీద ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య పోరుకు అంతా రెడీ అయింది. చెన్నై సూపర్ కింగ్స్​తో తాడోపేడో తేల్చుకునేందకు సన్​రైజర్స్​ హైదరాబాద్ సిద్ధమవుతోంది.

ఓటములతో కసి మీద ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య పోరుకు అంతా రెడీ అయింది. చెన్నై సూపర్ కింగ్స్​తో తాడోపేడో తేల్చుకునేందకు సన్​రైజర్స్​ హైదరాబాద్ సిద్ధమవుతోంది.

  • Published Apr 04, 2024 | 4:39 PMUpdated Apr 04, 2024 | 4:48 PM
SRH vs CSK: హైదరాబాద్ vs చెన్నై.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఓటములతో కసి మీద ఉన్న రెండు టాప్ టీమ్స్ మధ్య పోరుకు అంతా రెడీ అయింది. చెన్నై సూపర్ కింగ్స్​తో తాడోపేడో తేల్చుకునేందకు సన్​రైజర్స్​ సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్​లో ఓడిన ఎస్​ఆర్​హెచ్.. ఆ తర్వాత రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ను చిత్తు చేసింది. అయితే మూడో మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ చేతిలో ఓటమితో గాడి తప్పింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్​కే కూడా వరుస గెలుపుల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓటమితో కసి మీద ఉంది. మరి.. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్​లో ఏ టీమ్ ప్లేయింగ్ ఎలా ఉండనుంది? ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్​రైజర్స్ హైదరాబాద్

టోర్నీని పాజిటివ్​గా స్టార్ట్ చేసింది సన్​రైజర్స్. ఫస్ట్ మ్యాచ్​లో తృటిలో గెలుపు చేజారినా.. నెక్స్ట్ మ్యాచ్​లో ముంబైని చిత్తు చేసింది. అయితే గుజరాత్ చేతిలో ఓడి మళ్లీ గాడి తప్పింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీమ్​ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతడు బౌలింగ్​లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ భీకర ఫామ్​లో ఉండటం టీమ్​కు కొండంత బలం. గత మ్యాచ్​లో మంచి స్టార్స్ అందుకున్నా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వాళ్లు గానీ క్రీజులో సెటిల్ అయ్యారా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ట్రావిస్ హెడ్ కూడా సూపర్ టచ్​లో ఉన్నాడు. లోయరార్డర్​లో అబ్దుల్ సమద్ రాణిస్తుండటం టీమ్​కు మరో ప్లస్. అయితే బౌలింగ్​ విభాగం జట్టుకు మైనస్​గా మారింది. కమిన్స్ తప్పితే ఎవరూ నిలకడగా పెర్ఫార్మ్ చేయడం లేదు. భువీ, ఉనాద్కట్, సుందర్, మార్కండే భారీగా పరుగులు సమర్పించుకోవడం బిగ్ వర్రీ అనే చెప్పాలి.

చెన్నై సూపర్ కింగ్స్

మొదటి మ్యాచ్​లో ఆర్సీబీ, రెండో మ్యాచ్​లో జీటీని చిత్తు చేసిన చెన్నై.. మూడో మ్యాచ్​లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్​లో ఓటమిని రుచి చూసింది రుతురాజ్ సేన. ఓపెనర్ రచిన్ రవీంద్ర గత మ్యాచ్​లో స్లోగా ఆడాడు. సీనియర్లు అజింక్యా రహానె, డారిల్ మిచెల్ మంచి టచ్​లో కనిపిస్తుండటం బలంగా మారింది. రుతురాజ్​ బ్యాటింగ్​లో కన్​సిస్టెన్సీ లోపించింది. శివమ్ దూబె కూడా స్లోగా ఆడటం డీసీతో పోరులో సీఎస్​కేను ఇబ్బంది పెట్టింది. అతడు దీనిపై ఫోకస్ చేయాలి.

లెజెండ్ ఎంఎస్ ధోని సంచలన ఇన్నింగ్స్​తో తన ఫామ్​ను చాటుకోవడం బిగ్ ప్లస్. అవసరాన్ని బట్టి బ్యాటింగ్​లో ముందుకొచ్చి ఆడతానంటూ అతడు సిగ్నల్స్ పంపాడు. బౌలింగ్​లో పతిరానా అదరగొడుతున్నాడు. అయితే ముస్తాఫిజుర్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. వీసా ఇష్యూస్ వల్ల అతడు స్వదేశానికి పయనమయ్యాడని.. త్వరలో వస్తాడని సమాచారం. దీంతో సీఎస్​కే బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

ప్రిడిక్షన్

ఈ ఇరు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్​లో సన్​రైజర్స్ గెలవడం ఖాయం. ఈ రెండు టీమ్స్ ఇప్పటిదాకా 19 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 సార్లు సీఎస్​కే నెగ్గగా.. 5 మార్లు ఎస్​ఆర్​హెచ్​ను విజయం వరించింది. రికార్డుల పరంగా చెన్నై ముందంజలో ఉన్నా.. ఎస్ఆర్​హెచ్​ బ్యాటింగ్ డెప్త్, ఆ టీమ్ బ్యాటర్లు కసిగా ఆడుతున్న తీరు, గెలవాలనే తపనతో కమిన్స్ జట్టును నడిపిస్తున్న విధానం, హోమ్ గ్రౌండ్​లో మ్యాచ్ జరుగుతుండటంతో మొగ్గు హైదరాబాద్ వైపే ఉంది. అయితే రెండు జట్లు పటిష్టంగా ఉండటంతో తీవ్ర పోటీ తప్పేలా లేదు.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

హైదరాబాద్:
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయ్​దేవ్ ఉనాద్కట్.

చెన్నై:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్​పాండే, మతీష పతిరానా.

ఇదీ చదవండి: వీడియో: ప్రామిస్ చేసి మాట తప్పారు.. RCBపై చాహల్ సీరియస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి