iDreamPost

CSK ఆ ట్రిక్ ఎలా మిస్సయింది? ధోని బుర్రకు తట్టని ఐడియా!

  • Published Apr 06, 2024 | 11:13 AMUpdated Apr 06, 2024 | 11:13 AM

సన్​రైజర్స్​తో మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ ట్రిక్ మిస్సయింది. అదే వాళ్ల ఓటమికి కారణమైంది. ధోని బుర్రకు కూడా ఆ ఐడియా తట్టలేదు.

సన్​రైజర్స్​తో మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ ట్రిక్ మిస్సయింది. అదే వాళ్ల ఓటమికి కారణమైంది. ధోని బుర్రకు కూడా ఆ ఐడియా తట్టలేదు.

  • Published Apr 06, 2024 | 11:13 AMUpdated Apr 06, 2024 | 11:13 AM
CSK ఆ ట్రిక్ ఎలా మిస్సయింది? ధోని బుర్రకు తట్టని ఐడియా!

ఐపీఎల్-2024ను గ్రాండ్​గా స్టార్ట్ చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ టైటాన్స్​ను ఓడించి ఈసారి కూడా కప్పు తమదేనంటూ ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. అయితే హోమ్ మ్యాచెస్​లో చెలరేగిన రుతురాజ్ సేన.. ఇతర వేదికల్లో జరిగిన తర్వాతి రెండు మ్యాచుల్లోనూ తుస్సుమంది. మూడో మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిన సీఎస్​కే.. నిన్న ఉప్పల్​లో జరిగిన పోరులో సన్​రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోనూ పరాజయం పాలైంది. అయితే ఎస్ఆర్​హెచ్​తో మ్యాచ్​లో ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ టైమ్​లో సీఎస్​కే ఓ చిన్న ట్రిక్ మిస్సయింది. అదే వారి కొంప ముంచింది. ఏంటా ట్రిక్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్ఆర్​హెచ్-సీఎస్​కే మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన ఉప్పల్ పిచ్ మీద పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. పిచ్ స్లోగా ఉండటంతో టాస్ నెగ్గిన సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ నెమ్మదిగా ఉండటంతో స్పిన్ ఆల్​రౌండర్ అభిషేక్ శర్మతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు. ఆ తర్వాత క్రమంగా పేసర్లను రంగంలోకి దింపినా ఒకవైపు స్పిన్నర్లను కంటిన్యూ చేయించాడు. పిచ్​ ప్రవర్తిస్తున్న తీరును అర్థం చేసుకున్న బౌలర్లు ఎక్కువ పేస్​ వాడకుండా స్లో బౌన్సర్స్, కట్టర్స్, యార్కర్స్​తో చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. స్పిన్నర్లు కూడా టర్న్​తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కానీ ఇదే ట్రిక్​ను చెన్నై మిస్సయింది. సెకండ్ ఇన్నింగ్స్​లో బాల్ ఇంకా ఎక్కువ టర్న్ అయింది. పిచ్ స్పిన్​కు అనుకూలించింది.

CSK missed the trick

సన్​రైజర్స్ బ్యాటింగ్ సమయంలో బాల్ స్వింగ్ కాలేదు. పెద్దగా బౌన్స్ కూడా లేకపోవడంతో సీఎస్​కే పేసర్లతో మన ఓపెనర్లు ఆడుకున్నాడు. హెడ్, అభిషేక్ శర్మ కలసి చెన్నై బౌలర్ల దుమ్ముదులిపారు. ముకేశ్ చౌదరి వేసిన రెండో ఓవర్​లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు అభిషేక్. అయినా పేసర్లతోనే బౌలింగ్ కంటిన్యూ చేయించింది సీఎస్​కే. మొయిన్ అలీ, తీక్షణను కాస్త ముందే దించాల్సింది. ప్యాట్ కమిన్స్ చేసినట్లు ఓపెనింగ్ ఓవర్లు స్పిన్నర్లతో వేయిస్తే ఎస్​ఆర్​హెచ్​పై ప్రెజర్ పెరిగేది. కానీ ఈ ట్రిక్​ను కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మిస్సయ్యాడు. మ్యాచ్​లోని ప్రతి మూమెంట్​ను శ్రద్ధగా గమనిస్తూ ప్లాన్స్ వేసే ఎంఎస్ ధోనీకి కూడా ఈ ఐడియా తట్టలేదు. మొయిన్ అలీ బౌలింగ్​కు వచ్చే టైమ్​కే మ్యాచ్ చెన్నై నుంచి చేజారింది. అతడు తర్వాత వచ్చి 2 వికెట్లు తీసినా లాభం లేకుండా పోయింది. మరి.. ఎస్ఆర్​హెచ్​తో మ్యాచ్​లో సీఎస్​కేలో ప్లానింగ్ లోపించడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: CSK vs SRH మ్యాచ్.. CM రేవంత్ రెడ్డితో కలిసి సందడి చేసిన వెంకీ మామ! ఫొటోలు వైరల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి