iDreamPost

SRH vs MI: చరిత్ర తిరగరాసిన సన్​రైజర్స్.. ఈ రికార్డును కొట్టే టీమే లేదు!

  • Published Mar 27, 2024 | 9:41 PMUpdated Mar 28, 2024 | 12:46 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించింది ఎస్​ఆర్​హెచ్. ఆ టీమ్ సృష్టించిన కొత్త రికార్డును కొట్టడం ఏ టీమ్ వల్ల కూడా కాదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించింది ఎస్​ఆర్​హెచ్. ఆ టీమ్ సృష్టించిన కొత్త రికార్డును కొట్టడం ఏ టీమ్ వల్ల కూడా కాదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

  • Published Mar 27, 2024 | 9:41 PMUpdated Mar 28, 2024 | 12:46 PM
SRH vs MI: చరిత్ర తిరగరాసిన సన్​రైజర్స్.. ఈ రికార్డును కొట్టే టీమే లేదు!

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఏ టీమ్​కు వల్ల కూడా కానిది సాధించింది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో హయ్యెస్ట్ స్కోర్ చేసిన టీమ్​గా నిలిచింది. ముంబై ఇండియన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్​ఆర్​హెచ్ 20 ఓవర్లు ఆడి 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఈ క్రమంలో లీగ్​లో అత్యధిక స్కోరు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263)ను దాటేసి అరుదైన ఘనత సాధించింది. పరుగుల సునామీ ఎలా ఉంటుందో ముంబైకి చూపించింది ఎస్​ఆర్​హెచ్. ఆ టీమ్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి మరొకరు పరుగులు చేశారు. నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు బాదారు.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (11) తప్పితే మిగతా బ్యాటర్లంతా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63) సూపర్బ్ స్టార్ట్ అందించారు. హెడ్ 18 బంతుల్లో 50 పరుగుల మార్క్​ను చేరుకుంటే.. అభిషేక్ 16 బంతుల్లోనే ఆ ఫీట్​ను అందుకున్నాడు. తద్వారా సన్​రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ప్లేయర్​గా అరుదైన ఘనత సాధించాడు. ఈ జోడీ ఔట్ అయ్యాక కూడా ఎస్​ఆర్​హెచ్​ విధ్వంసం ఆగలేదు. సౌతాఫ్రికా ద్వయం ఎయిడ్​న్ మార్క్రమ్ (42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (80 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా క్లాసెన్ అయితే హిట్టింగ్​కు కొత్త నిర్వచనం చెబుతూ రెచ్చిపోయాడు.

34 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 80 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 4 బౌండరీలతో పాటు 7 భారీ సిక్సులు ఉన్నాయి. మార్క్రమ్-క్లాసెన్ దెబ్బకు స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ జోడీ నాలుగో వికెట్​కు 56 బంతుల్లో ఏకంగా 116 పరుగులు జోడించారు. దీంతో టీమ్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక, ముంబై ఛేజింగ్ స్టార్ట్ చేసింది. ఆ టీమ్ ప్రస్తుతం 2.3 ఓవర్లకు 43 పరుగులతో ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (7 బంతుల్లో 18 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 బంతుల్లో 27 నాటౌట్) జోరు మీద ఉన్నారు. వీళ్ల ఊపు చూస్తుంటే టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. మరి.. ఎస్​ఆర్​హెచ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి