iDreamPost

చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. IPL హిస్టరీలోనే తొలి బౌలర్​గా రికార్డు!

  • Published Apr 03, 2024 | 8:14 AMUpdated Apr 03, 2024 | 8:14 AM

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్​లోనూ సంచలన బౌలింగ్​తో రెచ్చిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడతను.

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్​లోనూ సంచలన బౌలింగ్​తో రెచ్చిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లను గడగడలాడించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడతను.

  • Published Apr 03, 2024 | 8:14 AMUpdated Apr 03, 2024 | 8:14 AM
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. IPL హిస్టరీలోనే తొలి బౌలర్​గా రికార్డు!

మయాంక్ యాదవ్.. ఈసారి ఐపీఎల్​లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అద్భుతమైన పేస్ బౌలింగ్​తో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడీ యువ పేసర్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో అతడు వేసే బుల్లెట్ బంతులకు బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. షాట్లు కొట్టడం పక్కనబెడితే కనీసం బాల్​ను టచ్ చేద్దామన్నా దొరకడం లేదు. క్విక్ పేస్​తో బంతులు సంధించడమే కాదు.. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తున్నాడు. క్యాష్ రిచ్ లీగ్​లో ఆడిన తొలి మ్యాచ్​లోనే ఫాస్టెస్ట్ డెలివరీ వేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ లక్నో పేసర్.. ఇప్పుడు మరో ఘతనను అందుకున్నాడు. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో చరిత్ర సృష్టించాడతను.

ఐపీఎల్ హిస్టరీలోనే మూడు సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన స్పీడ్​స్టర్​గా నిలిచాడు మయాంక్. కేవలం 2 మ్యాచుల్లో 50 బంతులు మాత్రమే వేసిన అతడు ఈ ఫీట్ సాధించాడు. సన్​రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోకియా మాత్రమే 2 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. వాళ్లిద్దర్నీ మయాంక్ అధిగమించాడు. బెంగళూరుతో మ్యాచ్​లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఓ బాల్​ను ఏకంగా 156.7 కిలోమీటర్ల వేగంతో వేశాడు మయాంక్. ఐపీఎల్ చరిత్రలో షాన్ టెయిట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ట్ డెలివరీగా ఉంది. అతడి తర్వాత లాకీ ఫెర్గూసన్ (157.3), ఉమ్రాన్ మాలిక్ (157.0) ఉన్నారు.

sensational record by mayank yadav

ఫాస్టెస్ట్ బౌలర్స్ లిస్ట్​లో మయాంక్ (156.7 కిలోమీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో అత్యధిక సార్లు బౌలింగ్ చేసిన వారి లిస్ట్​లో మాత్రం అతడే ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్​లో అతడు మ్యాజికల్ స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుల్లెట్ పేస్​తో అతడు విసిరిన బంతులకు టాప్ బ్యాటర్స్ గ్లెన్ మాక్స్​వెల్ (0), కామెరాన్ గ్రీన్ (9)కి మైండ్ బ్లాంక్ అయింది. వీళ్లిద్దర్నీ మయాంక్ వెనక్కి పంపాడు. అలాగే మంచి ఊపు మీదున్న రజత్ పాటిదార్ (29)ను కూడా ఔట్ చేశాడు. దీంతో లక్నో సంధించిన 181 పరుగుల టార్గెట్​ను రీచ్ కాలేకపోయింది బెంగళూరు. 153 పరుగులకు ఆలౌట్ అయింది డుప్లెసిస్ సేన. గత మ్యాచ్​లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన మయాంక్.. ఈ మ్యాచ్​లోనూ ఆ అవార్డును కొట్టేశాడు. మరి.. మయాంక్ సెన్సేషనల్ రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి