Nidhan
గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తన పరువు తానే తీసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు బిల్డప్ ఇచ్చిన ఈ ఆఫ్ఘానీ కరెక్ట్ టైమ్‌కు తుస్సుమన్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ తన పరువు తానే తీసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు బిల్డప్ ఇచ్చిన ఈ ఆఫ్ఘానీ కరెక్ట్ టైమ్‌కు తుస్సుమన్నాడు.
Nidhan
గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్లో కొత్త జట్లలో ఇదొకటి. ఆ టీమ్‌కు ఇది మూడో సీజన్ మాత్రమే. అయితే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం ట్రాక్ రికార్డే. లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే జీటీ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచి తృటిలో ట్రోఫీని మిస్సైంది. ఈసారి కూడా ఆ జట్టు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆట మాత్రం అందుకు తగ్గట్లుగా లేదు. ఆడిన 11 మ్యాచుల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ టీమ్ టెక్నికల్‌గా తప్పుకుంది. తదుపరి ఆడే మూడు మ్యాచుల్లోనూ నెగ్గినా ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే. టాప్ టీమ్స్ మీదే కాదు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఆర్సీబీ మీద కూడా ఆ జట్టు నిన్న ఓడిపోయింది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జీటీ అన్ని ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 19.3 ఓవర్లకు 147 పరుగులు చేసి కుప్పకూలింది. సాధారణ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 13.4 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఔట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత రెండు సీజన్లలో గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు రషీద్. బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేస్తూ మ్యాచ్ విన్నర్‌గా తన రోల్‌కు న్యాయం చేశాడు. కానీ ఈ సీజన్లో అతడి బ్యాట్ గర్జించడం లేదు. బాల్‌తో కూడా భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. నిన్న ఆర్సీబీతో మ్యాచ్‌లో అనవసర బిల్డప్ ఇచ్చి ఔట్ అయ్యాడు రషీద్.
బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో పేస్ బౌలింగ్‌లో అలవోకగా స్కూప్ షాట్ కొట్టాడు. క్రీజులో నుంచి కాస్త పక్కకు జరిగి బ్యాట్‌ను కరెక్ట్ టైమ్‌కు ఫ్లిక్ చేశాడు. అయితే ఇదే షాట్‌ను మ్యాచ్ టైమ్‌లో ఆడమంటే మాత్రం తుస్సయ్యాడు. జీటీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ వేసేందుకు బౌలింగ్‌కు వచ్చాడు ఆర్సీబీ పేసర్ యష్ దయాల్. అప్పటికే 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఊపు మీదున్నాడు రషీద్. దయాల్‌ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు ఆడదామని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో యష్ బాల్ వేయడానికి ముందే క్రీజులో నుంచి కుడి వైపునకు కదిలాడు రషీద్. దీంతో తెలివిగా లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకొని బ్రిలియంట్ యార్కర్ వేశాడు. అయితే తనకు అలవాటైన రీతిలో ఈజీగా దాన్ని బౌండరీకి తరలిద్దామని స్కూప్ షాట్ ఆడాడు రషీద్. కానీ బ్యాట్‌ను దాటుకొని వెళ్లిన బాల్ వికెట్లను గిరాటేసింది. దీన్ని చూసిన నెటిజన్స్ నెట్స్‌లో కాదు.. మ్యాచ్‌లో ఆడినోడే గొప్ప అని అంటున్నారు. బిల్డప్‌లు తగ్గించి గేమ్‌పై కాన్సంట్రేట్ చేయాలని సూచిస్తున్నారు.